ఇండస్ట్రీలో టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. అదృష్టం కూడా ఉండాలి. అప్పుడే కెరీర్ అద్భుతంగా ఉంటుందని చెప్తారు. కానీ కీర్తి సురేష్ కు మాత్రం ఈ అధృష్టం ఉన్నట్టు కనిపించడం లేదు. బోల్డంత టాలెంట్ ఉన్నా.. సరైన సక్సెస్ రేట్ లేక వెనుకబడిపోతోంది కీర్తి. ఇప్పుడున్న హీరోయిన్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫామెర్ కీర్తి సురేష్. మహానటితో ఉత్తమనటిగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. అయితే జాతీయ స్థాయిలో మెప్పుపొందినా ఆ రేంజ్ లో అదరగొట్టలేకపోతోంది కీర్తి. టాలెంట్ కు తగ్గ బ్లాక్ బస్టర్స్ అందుకోలేకపోతోంది. ఇక మహానటి తర్వాత అయితే కీర్తికి సరై హిట్టే రాలేదు. 

 

కీర్త సురేష్ మహానటి తర్వాత తమిళ్ లో ఎక్కువగా సినిమాలు చేసింది. స్టార్ హీరోలు, విక్రమ్, విజయ్, విశాల్ తో యాక్ట్ చేసింది. సామీ స్క్వేర్, సర్కార్, సందకోళి2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకెళ్లింది. అయితే వీటిలో సర్కార్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. మిగిలిన రెండు సినిమాలు ఫ్లాపుల్లో కలిసిపోయాయి. 

 

లాక్ డౌన్ లో రిలీజ్ అయిన కీర్తి సురేష్ మూవీ పెంగ్విన్ కూడా ఆకట్టుకోలేకపోయింది. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు బిలో యావరేజ్ రిపోర్ట్ వచ్చింది. వరల్డ్ కంటెంట్ ని ఎక్స్ పీరియన్స్ చేస్తున్న డిజిటల్ ఆడియన్స్ కు ఈ పెంగ్విన్ పెద్దగా కనెక్ట్ కాలేదు. దీంతో కీర్తి ఫ్లాపుల సంఖ్య మరింత పెరిగింది. 

 

పెరుగుతున్న ఫ్లాపులతో కీర్తి సురేష్ గ్రాఫ్ పడిపోతోంది. పైగా కీర్తి స్టార్ హీరోలతో నటించిన సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. దీనికి తోడు కీర్తికి హోమ్లీ హీరోయిన్ అనే ఇమేజ్ ఉంది. దీంతో ఆమెకు స్టార్స్ నుంచి అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. 

 

కీర్తి సురేష్ కు స్టార్టింగ్ లో బాగానే హిట్స్ వచ్చాయి. నేను శైలజ, నేను లోకల్ విజయాలతో పవన్ కళ్యాణ్ ను ఇంప్రెస్ చేసింది. అజ్ఞాతవాసిలో పవన్ తో జోడీ కట్టింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తాపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: