బాహుబలి తర్వాత ప్రభాస్ కెరీర్ లో ఎన్ని మార్పులొచ్చాయో.. రమ్యకృష్ణ కూడా అంతే బిజీ అయింది. పవర్ ఫుల్ రోల్స్ కు ఆప్షన్ గా మారింది. అయితే ఇప్పుడీ శివగామికి పోటీగా రంగంలోకి దిగుతున్నారు ఇద్దరు మాజీ హీరోయిన్లు. ఒకరు తుపాకీ పట్టి బరిలోకి దిగుతుంటే మరొకరు పవర్ ప్యాక్డ్ ఇమేజ్ తో పోటీలోకి వస్తున్నారు. 

 

బాహుబలితో రమ్యకృష్ణ ఇమేజ్ బోల్డంత పెరిగిపోయింది. శివగామిగా నార్త్ లోనూ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అందుకే పాన్ ఇండియన్ మూవీస్ కు రమ్యకృష్ణను ఫస్ట్ ఆప్షన్ గా చూస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ మార్కెట్ లెక్కలతోనే విజయ్ దేవరకొండ  ఫైటర్ సిినిమాకు రమ్యకృష్ణను తీసుకున్నాడు పూరీ జగన్నాథ్. 

 

మదర్ క్యారెక్టర్స్ కు మాత్రమే కాదు.. ఇంపార్టెన్స్ రోల్స్ కు కూడా రమ్యకృష్ణను తీసుకుంటున్నారు. నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు శివగామిని ఒక హీరోయిన్ గా తీసుకున్నాడు నాగార్జున. అలాగే నాగచైతన్య నటించిన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో టైటిల్ రోల్ ప్లే చేసింది రమ్యకృష్ణ. 

 

తెలుగు, తమిళ్ లో మల్టీలింగ్వల్ గా రూపొందుతున్న చాలా సినిమాలు రమ్యకృష్ణను కాంటాక్ట్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు ఈమెకు రేణుదేశాయ్, ప్రియమణి నుంచి గట్టిపోటీ ఎదురవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ రమ్యకృష్ణకు ఎర్త్ పెడుతున్నారని చెప్పుకుంటున్నారు సినీజనాలు. ప్రియమణి చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. టీవీ షోస్ లో బిజీబిజీగా గడిపేస్తోంది. ఇక రేణుదేశాయ్ అయితే యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి చాలా ఏళ్లు అవుతోంది. 

 

రేణు దేశాయ్ యాక్టింగ్ ని పక్కనపెట్టి చాలా కాలమైంది. మరాఠీలో ఇష్క్ వాలా లవ్ అనే సినిమా డైరెక్ట్ చేశాక కొంతకాలం బ్రేక్ తీసుకుంది. ఈ మధ్యే రైతు సమస్యలపై ఒక సినిమా తీసేందుకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసింది. అయితే లాక్ డౌన్ తో ఈ పల్లెకథ కాగితాలు దాటి బయటకు రాలేదు. 

 

రేణుదేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వస్తుందనే ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు నిర్మాణంలో తెరకెక్కబోయే మేజర్ సినిమాలో రేణు ఒక కీ రోల్ ప్లే చేస్తుందనే టాక్ వస్తుంది. 26/11 ముంబయి దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కబోతున్న ఈ మూవీలో అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: