అఫైర్లు ఉంటే మీడియా రాస్తుంది. ఆ మీదట అలాంటివి లేవు అంటూ అందమైన హీరోయిన్ గుస్సా అవుతుంది. ఎవరు ఇలా రాసేస్తున్నారు ఆధారాలు లేకుండా అంటూ హీటెక్కిపోతుంది. వారి అంతు చూస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇది కదా చిత్ర సీమలో జరిగే విచిత్రం. మరి అలా కాకుండా తనకు అఫైర్లు ఉన్నాయని ఒక అందమైన హీరోయిన్ చెప్పుకుంటోంది అంటే ఆమె డేరింగ్ కే కాదు నిజాయతీకి కూడా జోహార్ అనాల్సిందే.

IHG

ఆమె ఎవరో కాదు ఇషా చావ్లా, ఆ మధ్య బాలక్రిష్ణ సినిమా శ్రీమన్నారాయణలో సెకండ్ హీరోయిన్ గా నటించి హీటెక్కించిన ఇషా అందగత్తె. ఒంపులూ సొంపులూ అన్నీ ఉన్నా కూడా లక్కు చిక్కకపోవడంతో పెద్ద స్టార్ కేలేకపోయింది .ఇక ఆమె కమెడియన్  సునీల్ తో కలసి మూడు సినిమాల్లో హీరోయిన్ గా చేయడంతో ఆమెను యంగ్ హీరోలు పట్టించుకోలేదని అంటారు.

IHG

ఇక ఈ ముద్దు గుమ్మ ఇపుడు సోషల్ మీడియాలో యమ‌ స్పీడ్ గా ఉంది. తన ఇన్స్టాగ్రామ్ లో తన  హాట్ పిక్స్ ని పెడుతూ రెచ్చగొడుతోంది. మళ్ళీ చాన్సులు ఇస్తే వచ్చి సత్తా చాటుతాను అంటోంది. ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా ఈ అందం తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. తనకు ఇద్దరితో రిలేషన్ షిప్ బాగా నడిచిందని చెప్పుకుంది.

IHG

మొదటి రిలేషన్ షిప్ అయితే కొన్నేళ్ల పాటు సాగిందని, రెండవది మాత్రం చిన్నదని చెప్పుకుంది. ఇపుడు మాత్రం తనకు ఎటువంటి అఫైర్లు లేనే లేవని అంటోంది. ఇన్ని చెప్పిన  ఈ అమ్మడు తాను రిలేషన్ షిప్ పెట్టుకున్న వాళ్ళు ఎవరో చెప్పకపోవడం గడుసుతనమే. ఇక తనకు ఇప్పట్లో పెళ్ళి చేసుకోవాలని లేదని కూడా ఇషా చావ్లా చెప్పేసింది.

IHG

అయితే పెళ్ళి కొడుకుని కనుక ఎంచుకుంటే అందగాడు చందురూడూ  అనే కంటే నిజాయతీపరుడు మంచివాడు అయి ఉండాలని కోరుకుంటోంది. మొత్తానికి ఇషా చావ్లా తన అఫైర్లు బయటపెట్టడం విశేషమే మరి. ఎంతైనా అందగత్తె మాత్రమే కాదు  గట్స్ ఉన్న హాట్  బ్యూటీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: