కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ప్రపంచంలో అందరి జీవితాలలో అన్ని రంగాలలో లెక్కలు మొత్తం తారుమారయ్యాయి. ఈ వైరస్ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయినా రంగాలలో సినిమా రంగం కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ముందుగానే ఈ వైరస్ ప్రభావం అంచనా వేసిన హాలీవుడ్ గత ఏడాది చివరి ఉండే సినిమాలు రిలీజ్ చేయకుండా ఆపివేయడం జరిగింది. భారీ స్థాయిలో సినిమాలు తెరకెక్కించిన మరికొద్ది రోజుల్లో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యి సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకునే సినిమాలు కూడా రిలీజ్ చేయకుండా ఆపేయటం జరిగింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తుంది. మొన్నటి వరకు ప్రపంచ దేశాలు అన్ని లాక్ డౌన్ లో కి వెళ్ళి పోయాయి. ఇటీవల లాక్ డౌన్ నుండి చాలా వరకు దేశాలు బయటపడ్డాయి.

 

దీంతో సినిమా రిలీజ్ లు చేయటానికి డైరెక్టర్లు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో వరల్డ్ నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున క్రిస్టోఫర్ నోలన్ ఆధ్వర్యంలో వచ్చిన ‘టెనెట్’ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. నోలన్ సినిమా ఎన్నో దేశాల్లో ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. ఈ నేపథ్యంలో జూలై నెల ఆఖరి లోపు పరిస్థితులు అంతా చక్కబడతాయి అని నోలన్ టెనెట్ సినిమాని 31 న రిలీజ్ చేయడానికి రెడీ అయిపోవటం జరిగింది. కానీ తర్వాత ప్రపంచ దేశాలలో కరోనా ప్రభావం ఉన్న కొద్దీ విలయతాండవం చేయటంతో పాజిటివ్ కేసులు భయంకరంగా బయటపడటంతో మళ్లీ డేట్ మార్చడం జరిగింది.

 

ఈసారి ఆగస్టు 12 వ తారీఖు న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అంతే కాకుండా ఎంతో కాన్ఫిడెంట్ గా కూడా ఉన్నాడు డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్. ఇదిలా ఉంటే క్రిస్టోఫర్ నోలన్ సినిమాలకు మంచి మార్కెట్ ఉన్న దేశాలలో ప్రస్తుతం వైరస్ భారీ స్థాయిలో ఉంది. ఈ ఏడాది చివరి వరకు సినిమా థియేటర్లు ఆ దేశాలలో ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. దీంతో విదేశాలలో ఉన్న క్రిస్టోఫర్ నోలన్ అభిమానులు ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుని సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అని మరోసారి డేట్ విషయంలో చేసుకుంటే ‘టెనెట్’ నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉంటారని సూచనలు ఇస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: