సినిమాగా తెరకెక్కించడానికి ఉపయోగపడే రెడీమేడ్ కథ ఏదన్నా ఉందంటే అది పోలీస్ వ్యవస్థ గురించే. పోలీసుల ధీరత్వాన్ని ప్రతిబింబిస్తూ ఎన్నో సినిమాలు తెలుగులో వచ్చాయి. ఖాకీ డ్రెస్ లో ఉన్న పౌరుషం, సిన్సియారిటీని సినిమాల్లో చూస్తే ప్రేక్షకుల్లోనే తెలీని ఉత్సాహం వస్తుంది. అటువంటి ధీరోదాత్త సినిమాల్లో ఒకటి ‘అంకుశం’. ఈ సినిమా అప్పట్లో ఓ ప్రభంజనమే సృష్టించింది. హీరో రాజశేఖర్ ను యాంగ్రీ యంగ్ మ్యాన్ ను చేసింది. అప్పట్లో ఈ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ చూసి ఎందరో పోలీసులు ఆయన్ను అభినందించారంటే అతిశయోక్తి కాదు.

IHG

 

అనాధగా దొరికిన పసికందును చేరదీసి విద్యాబుద్ధులు నేర్పిస్తాడు ఓ మాస్టారు. కొన్నాళ్ల తర్వాత ఆ అనాధ పోలీస్ ఆఫీసర్, మాస్టారు సీఎం అవుతారు. ఇద్దరి వ్యక్తిత్వం ఒకటే.. సమాజంలో అన్యాయం జరుగకుండా చూడటమే. సమాజంలో నేరస్థులు, దుర్మార్గులను ఎదుర్కొనే పాత్రలో రాజశేఖర్ నటన అద్భుతం. పోలీస్ క్యారెక్టర్ కు ఆ సమయంలో రాజశేఖర్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు. పోలీస్ అంటే రాజశేఖర్ లా ఉండాలనేంతగా నటించాడు. యాక్షన్, డైలాగ్స్, ఫైట్స్, సెంటిమెంట్.. ఇలా ప్రతి అంశంలోనూ రాజశేఖర్ ది బెస్ట్ గా నటించాడు. సినిమా కథ ఎంత ఆసక్తిగా ఉంటుందు రాజశేఖర్ పెర్ఫార్మెన్స్ కూడా అదేస్థాయిలో ఉంటుంది.

IHG

 

సినమా క్లైమాక్స్ లో విధుల్లో భాగంగా బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయే సీన్ లో రాజశేఖర్ నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో రాజశేఖర్ స్టార్ హీరో అయిపోయాడు. సినిమా కథ, రాజశేఖర్ నటన సినిమా విజయంలో కీలకపాత్ర పోషించాయి. దర్శకుడిగా కోడి రామకృష్ణ రాజశేఖర్ నుంచి మంచి నటన రాబట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ పోలీస్ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయడు. తర్వాత రాజశేఖర్ చేసిన అనేక పోలీస్ సినిమాలకు అంకుశమే దారి చూపింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: