తెలుగు, హింది భాషల్లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని అవి తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో పంచుకుంటున్నారు. తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ ను సినిమాలతో అలరించిన ఈ అమ్మడు రాం హీరోగా పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమాతో అమ్మడి తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించింది. ఇక లాక్ డౌన్ టైం లో తన సొంత టాలెంట్ చూపిస్తొ రకరకాల వంటలు చేసిన ఈ బ్యూటీ ఆన్ లైన్ యాక్టింగ్ కోర్సులు కూడా నేర్చుకుంది.

 

ఇక తన చిన్నప్పటి గ్నాపకాలను గుర్తు చేసుకున్న ఈ బ్యూటీ ప్రొగ్రెస్ కార్డ్ మీద తన మదర్ సైన్ ఫోర్జరీ చేసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. మార్కులు తక్కువగా వచ్చినప్పుడు ప్రొగ్రెస్ కార్డ్ మీద అమ్మ సైన్ ఈజీగా పెట్టేసేదట నిధి అగర్వాల్. తన తండ్రి సైన్ చాలా కష్టంగా ఉంటుందట. అందుకే మదర్ సైన్ ఈజీగా ఉంటుందని అది ప్రొగ్రెస్ కార్డ్ మీద పెట్టేదట. అయితే చాలాసార్లు ఇలా చేయగా ఒకసారి తన మదర్ కి దొరికిపోయి తిట్లు తిన్నా అని చెప్పుకొచ్చింది నిధి.

 

ఇక ఓ పక్క తనని తిడుతూనే తనని ఎంకరేజ్ చేసే వారిలో తన మదర్ ముందుంటారని అంటుంది నిధి అగర్వాల్. తన మొదటి సినిమా రిలీజ్ అయినప్పుడు పేరెంట్స్ చాలా ఆనందపడ్డారని. ఇప్పటికి వరకు నువ్వు సాధించింది చాలా ఎక్కువ. నువ్వు ఏమి దిగులు పడకు అని అమ్మ చెప్పే ఆ మాటలు తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని చెబుతుంది నిధి అగర్వాల్. మొత్తానికి నిధికి వాళ్ల మదర్ సూపర్ సపోర్ట్ తోనే నిధి అగర్వాల్ కెరియర్ సాఫీగా సాగుతుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: