పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్, వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాలీవుడ్ పింక్ సినిమాకి తెలుగు రీమేక్ గత తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నాడు. హిందీలో అమితాబ్ పోషించిన పాత్రని తెలుగులో పవన్ కళ్యాన్ చేస్తున్నాడు.

 

సినిమా ముఖ్యంగా ముగ్గురి అమ్మాయిలకి సంబంధించిన కథ. పవన్ కళ్యాణ్ పాత్ర ఆ ముగ్గురు అమ్మాయిలకి సాయం చేసే విధంగా ఉంటుంది. ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఒకరు నివేథా థామస్ కాగా మరొకరు అనన్య నాగళ్ల అని వార్తలు వస్తున్నాయి. మరో అమ్మాయిగా ఎవరు నటిస్తున్నారనేది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఒరిజినల్ పింక్ సినిమాలో హీరో తాలూకు ఎలివేషన్లు ఉండవు. కానీ తెలుగులో రీమేక్ చేస్తున్నందున పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఎలివేషన్స్ తో పాటు పవన్ సరసన హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేసారట. 

 

తాజాగా ఈ సినిమా నుండి ఓ పిక్ బయటకి వచ్చింది. లాయర్ గా చేస్తున్న పవన్ కళ్యాణ్ కోర్టుకి రెడీ అవుతుండగా ఉన్న లాయర్ డ్రెస్ లోని పవన్ కళ్యాణ్ ఫోటో లీక్ అయ్యింది. సినిమాలో ఇది చాలా ఇంపార్టెంట్ లుక్. ఇప్పటి వరకూ ఫస్ట్ లుక్ మినహా మరే ఫోటో కూడా బయటకి రాలేదు. కానీ లాయర్ డ్రెస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటో బయటకి రావడం చిత్రబృందాన్ని ఇబ్బంది కలిగిస్తోంది. పవన్ అభిమానులకి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గా ఒక్కొక్కటి రివీల్ చేద్దామనుకుంటే, ఇలాంటి లీకేజీలు ఇబ్బందిపెడితే అభిమానులకి ట్రీట్ ఇవ్వడం కష్టంగా మారనుంది.

 

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. పదిశాతం మినహా మిగతా చిత్రీకరణ అంతా పూర్తి చేసుకుంది. మిగతా భాగం చిత్రీకరణ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి కానుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: