‘ఈ నగరానికి ఏమైంది’ ‘ఫలక్ నుమా దాస్’ ‘హిట్’ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న విశ్వక్ సేన్ ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్ హీరోలకు ఇచ్చిన ఉచిత సలహా ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. బంధు ప్రీతి ఆశ్రితపక్షపాతం అనేవి ఒక్క సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో ఉంటాయని అయితే అలాంటి సమస్యలు తనకు ఎప్పుడు పెద్దగా ఎదురవ్వలేదు అని కామెంట్ చేసాడు.


ఇదే సందర్భంలో మరొక ట్విస్ట్ ఇస్తూ స్టార్ దర్శకులు కొత్త వాళ్ళతో సినిమాలు తీసే రోజులు వస్తే బాగుంటుందని అయితే స్టార్ దర్శకులు అంతా హీరోలకు ఉన్న మార్కెట్ ను లెక్కలు వేసుకుని సినిమాలు తీస్తున్నారని విశ్వక్ సేన్ అభిప్రాయ పడుతున్నాడు. తాను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో సెటిల్ అవుతున్న పరిస్థితులలో కరోనా వచ్చి తన కెరియర్ కు బ్రేక్ వేసిందని చెపుతూ ఇంటిలో ఖాళీగా ఉండటంతో తాను కొత్తకొత్త ఇటాలియన్ వంటలు నేర్చుకుని కాలం గడుపుతున్న విషయాన్ని తెలియచేసాడు.


ఇక చైనా యాప్స్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో 135 కోట్లమంది జనం ఉన్న పరిస్థితులలో ఎంతవరకు ప్రచారం చేసినా చైనా యాప్స్ ప్రొడక్ట్స్ నిషేధం జరుగుతుంది అన్న విషయమై తనకు సందేహాలు ఉన్నాయని ఈ యంగ్ హీరో అభిప్రాయపడుతున్నాడు. అయితే చైనీస్ యాప్స్ ప్రొడక్ట్స్ కు బదులు మన ఇండియా ప్రొడక్ట్స్ వాడమని ప్రచారం చాల ఉధృతంగా జరిగితే కాని జనంలో మార్పు రాదనీ ఇతడి అభిప్రాయం.


పరిస్థితులు చక్కపడ్డాక తాను మంచి ఫ్యామిలీ ఎంటర్ టైన్ మూవీలలో నటిస్తానని చెపుతూ ఇప్పటికే తాను నాలుగు మంచి కథలు ఓకె చేసిన పరిస్థితులలో తనకు అవకాశాల పై భయంలేదు అని అంటున్నాడు. ఒకసారి షూటింగ్ లు అంటు మొదలైతే సంవత్సరానికి నాలుగు సినిమాలు చేసే సత్తా తన వద్ద ఉందని చెపుతూ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: