భారత్ లో కరోనా కేసుల సంఖ్య సెప్టెంబర్ కు 20 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియాలో కథనాలు వస్తున్న పరిస్థితులలో జనం హడలిపోతున్నారు. దీనితో కరోనా రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై ఎవరి స్థాయిలో వారు ఆలోచనలు చేస్తున్నారు.


ఇలాంటి పరిస్థితులలో హీరో రామ్ కరోనా కట్టడికి జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ‘సూపర్ మ్యాన్’ లాంటి డ్రెస్ వేసుకుని తనని తాను ఈ కరోనా మహమ్మారి నుంచి ఎలా రక్షణ పొందుతున్నాడో చూపించే విధంగా షేర్ చేసిన పొటోలు ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఫోటోలలో రామ్ తన బాడీ మొత్తం కనిపించకుండా కవర్ చేసుకొని ఒక స్పైడర్ మ్యాన్ గెటప్ లో కనిపిస్తూ ఇలా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే మన పై కరోనా దాడి చేయలేదు అని తన సలహాలను షేర్ చేస్తున్నాడు.  


ఇప్పటికే జనం కరోనా భయాలతో బయటకు వెళితే చాలు మాస్కులు  గ్లౌజులు శానిటైజర్స్ చేతిలో పెట్టుకుని ఒక యుద్ధానికి వెళుతున్న సైనికుడు లా టెన్షన్ తో బయటకు వస్తున్నారు. ఈ వస్తువుల కోసం అతి సామాన్యుడు కూడ అతడికి వచ్చే ఆదాయంలో ఎక్కువగా ఖర్చు పెడుతున్నాడు.


ఇప్పుడు కరోనా మహమ్మారి సోకకుండా ఇలాంటి సూపర్ మ్యాన్ రక్షణ సూట్స్ ను శరీరం అంతా కవర్ అయ్యే విధంగా కొనుక్కోవాలి అంటే చాల డబ్బులు ఖర్చు పెట్టాలి. ప్రస్తుత పరిస్థితులలో నిత్యావసరాలు తీర్చుకోవడం కోసం సతమతమవుతున్న సగటు జీవి రామ్ ఇచ్చిన విచిత్రమైన ఉచిత సలహాలను ఎంత వరకు పాటించగలరు అన్నదే అర్ధంకాని ప్రశ్న. ఇది ఇలా ఉండగా రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రెడ్’ ను ప్రముఖ ఒటీటీ సంస్థ అమెజాన్ భారీ మొత్తాలు ఇచ్చి కొనడానికి ప్రయత్నించినా రామ్ తన సినిమాను ఒటీటీ సంస్థలకు ఇవ్వను అని చెప్పడంతో ‘రెడ్’ సక్సస్ పై రామ్ ఎంత నమ్మకం ఉంచుకున్నాడో అర్ధం అవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: