కామెడీ అంటే ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. ఎంత పెద్ద యాక్షన్ సినిమా అయినా ఎంతో కొంత కామెడీ లేకపోతే ఎట్టా అనే ప్రేక్షకులు చాలా మంది ఉంటారు. టాలీవుడ్ లో కామెడీ స్టార్ రాజేంద్రప్రసాద్ తర్వాత అంతలా ప్రేక్షకుల్ని తన హాస్యంతో ఆకట్టుకొంటున్న నటుడు నరేష్. ఇక కామెడీ చేయడంలో కాస్త అటూ ఇటూ అయ్యిందంటే వెకిలి కామెడీ అయిపోద్ది. కామెడీతో కితకితలు పెట్టించే దర్శకులు, హీరోలు అతి తక్కువ మందే ఉంటారు.

 

 

2002లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రం అల్లరితో కామెడీ నటుడిగా తననుతాను ప్రూవ్ చేసుకొని ఆడియన్స్ కు దగ్గరైయ్యాడు. ఈ సినిమా తర్వాత అల్లరి అనేది నరేష్ ఇంటిపేరుగా మారిపోయింది. కామెడీతో కితకితలు పెట్టించే ఆయన ‘కితకితలు’ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సుమార్ 42 మంది స్టార్ కమెడియన్లు ఈ చిత్రంలో నటించారు.

 

 

హాస్యానికి అని కాలరెగరేసే ఇవివి చిత్రాలకు కొంతకాలంగా కలిసి రావడం లేదు. కొడుకుని హీరోగా నిలబెడదామని 'కితకితలు'తో చేసిన ప్రయత్నం పనికిరాకుండా పోయింది. కుండపోతలా డైలాగులు, స్క్రీన్‌ టైంతో కొద్దిగా కూడా కదలని కథనం, పాతకాలం టేకింగ్‌ సినిమాను తలకిందులు చేశాయి.

 

 

ఈ సినిమాలో నరేష్‌ కొత్తగా ఉద్యోగంలో చేరిన ఎస్సై. ఇంట్లో వాళ్ళంతా ఉరేసుకుంటానని బెదిరిస్తే తప్పని స్ధితిలో కోటీశ్వరురాలు, స్ధూలకాయురాలైన సౌందర్యను పెళ్ళాడుతాడు. ఇష్టం లేని పెళ్ళితో కష్టంగా హనీమూన్‌కి వెళ్తాడు. అక్కడే రంభ పరిచయమవుతుంది. అతని డబ్బు చూసి మోజుపడుతుంది.

 

 

రాజబాబు తన భార్యని చిన్న చూపు చూసి రంభ వెంటపడతాడు. పెళ్ళానికి విడాకులిచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు.ఈ సినిమాలో నరేష్ పోలీసు పాత్రలో అందరిని మెప్పించారు. సినిమాలో నరేష్ జీప్ కోసం పరిగెత్తే సీను అందరిని ఎంతగానో మెప్పించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: