బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం మీద ఎన్ని విమర్శలు వస్తున్నాయో తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బంధుప్రీతిపై అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే వారసత్వం కేవలం బాలీవుడ్ కే చెల్లింది కాదు. టాలీవుడ్, కొలీవుడ్, హాలీవుడ్, ఇలా ప్రతీ సినిమా ఇండస్ట్రీలోనూ ఉంది. ఆ మాట సినిమా ఇండస్ట్రీయే కాదు ప్రతీ చోటా బంధుప్రీతి ఉంది. వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చేవారు, వ్యాపారంలోకి వచ్చేవారు ఎంతో మంది ఉన్నారు.

 

 

అందుకే వారసత్వంపై నిరసన గళాలు ఎన్ని వినిపిస్తున్నాయో వారికి వ్యతిరేకంగా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలోనూ వారసత్వ పోకడ ఉంది. ప్రస్తుతం తెలుగులో ఉన్న టాప్ హీరోలందరూ సినిమా ఫ్యామిలీ నుండి వచ్చినవారే. అయితే వారసత్వం కేవలం సినిమాల్లో ఎంట్రీ వరకే పనిచేస్తుంది. ఆ తర్వాత హీరోగా రాణించాలంటే టాలెంట్ మీదే ఆధారపడి ఉంటుంది.

 

 

ప్రస్తుతం తెలుగు సినిమాకి పరిచయం కావాల్సిన వారసులు చాలా మందే ఉన్నారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతలా వార్తలు వస్తున్నాయో తెలిసిందే. అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుండి వారసుడు రానున్నాడనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. రానా తమ్ముడు అభిరామ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని వార్తలు వస్తుండగా, వెంకటేష్ కుమారుడి ఎంట్రీ గురించి అనేక రూమర్లు వినిపిస్తున్నాయి.

IHG

తాజాగా సురేష్ బాబు వెంకటేష్ కుమారుడి ఎంట్రీ గురించి ఓపెన్ అయ్యాడు. వెంకటేష్ కుమారుడు ఇంకా స్కుల్ స్టడీస్ లోనే ఉన్నాడని, ఇప్పుడప్పుడే సినిమాలో ఎంట్రీ గురించి ఆలోచించడం లేదని, దానికి ఇంకా టైమ్ ఉందని, ఏదైనా వ్యక్తిగత నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుందని తెలిపాడు. 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: