బాలీవుడ్ నటుడు, హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.  ముంబైలోని తన నివాసంలో సుశాంత్ సింగ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  2008లో సుశాంత్ సింగ్ స్టార్ ప్లస్ లోని ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యారు.  ఆ సీరియల్ మంచి విజయం సాధించడంతో సుశాంత్ సింగ్ పేరు మారుమ్రోగిపోయింది.  ఆ తరువాత కై పో చెయ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుతుపెట్టారు.  ఈ సినిమా తరువాత శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు.  అంతకు ముందు కొద్ది రోజుల  క్రితమే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ మేనేజర్ దిశా సలిన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే  34 ఏళ్ళ సుశాంత్ బాలీవుడ్ లో బంధుప్రీతి ఎక్కువగా ఉండటం వల్ల తనకు సినీ ఛాన్సులు రావడం లేదన్న డిప్రేషన్ కి లోనై ఆత్మహత్య చేసుకున్నారని పలువురు సహ నటులు ఆవేదన వ్యక్తం చేశారు.  


 గత కొంత కాలంగా బాలీవుడ్ లో కొంత మంది సినీ పెద్దల చెప్పు చేతల్లో ఉండటం వల్లనే ఎంతో మంది యువ నటులు ఛాన్సులు లేక ఇబ్బందులు పడుతున్నారట.. చివరికి సుశాంత్ ఆత్మహత్యనే చేసుకున్నాడు. తాజాగా శాంత్‌ సింగ్‌ మృతిపై సీబీఐ బృందంతో దర్యాప్తు చేయించాలని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు శేఖర్‌సుమన్‌ డిమాండ్‌ చేశాడు. సుశాంత్‌ అకాల మరణంతో వ్యక్తిగతంగా తనను ఎంతో బాధించిందని శేఖర్‌ సుమన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.


 ఈ మద్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల వల్ల తన కొడుకు ఆధ్యాయన్‌ కూడా సుశాంత్‌ లాగే ఇబ్బంది పడ్డాడని చెప్పాడు. తనకు ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వస్తున్నాయని కూడా గతంలో ఓ సారి అధ్యాయన్‌ తనకు చెప్పాడని సుమన్‌ అన్నాడు. అధ్యాయన్‌ డెహ్రాడూన్‌ డైరీ, రాజ్‌..ది మిస్టరీ కంటిన్యూస్‌, హిమ్మత్‌వాలా, హర్ట్‌లెస్‌ వంటి సినిమాల్లో నటించాడు.  అధ్యాయన్‌కు కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని అతని హామినిచ్చినట్లు చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: