ప్రశాంతంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ సాగిపోతున్న ప్రపంచంలోకి ఒక్కసారిగా పెనుతుఫానుగా వచ్చి భీభత్సం సృష్టిస్తున్న వైరస్, ప్రపంచవ్యాప్తంగా ప్రజలని తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తోంది. కరోనా వైరస్ వల్ల ప్రజల్లో భయాందోళనలు చెలరేగడమే కాదు ఆర్థికంగా చాలా నష్టం వాటిల్లింది. ఇంకా నష్టం వస్తూనే ఉంది. కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి లాక్డౌన్ ఆయుధాన్ని ప్రయోగించిన ఆశించిన ఫలితం లేకుండా పోయింది.

 

ఎక్కువ రోజులు లాక్డౌన్ పెట్టడం వల్ల తిండికి కూడా కష్టం అవుతుందన్న నేపథ్యంలో లాక్డౌన్ సడలింపులు మొదలయ్యాయి. మెల్లగా ఒక్కొక్కటిగా వ్యాపార సంస్థలు తమ వ్యాపారాలను పునః ప్రారంభించారు. అయితే ఈ నేపథ్యంలో ఎన్నో మార్పులు చోటి చేసుకున్నాయి. కరోనాకి ముందు ప్రపంచం ఎలా ఉందో.. కరోనాతో జీవిస్తూ అలా ఉండడానికి వీల్లేదు. కరోనాకి ఇంకా మందు కనుగొనబడని కారణంగా అనేక నియమ నిబంధనలు పాటించాల్సిందే.

 

అయితే లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమా షూటింగులకి అనుమతులు లభించాయి. దాంతో సినిమాలు, సీరియళ్ళు స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా రంగంలో పెనుమార్పులు వచ్చాయి. అందులో భాగంగానే చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఎక్కువ సిబ్బంది ఉండకపోవడం, పరిమిత సిబ్బందితోనే పనులన్నింటినీ చేసుకోవడం, పీపీఈ కిట్లు వాడడం, భౌతిక దూరం పాటించడం మొదలగునవి ఖచ్చితంగా పాటించాలి.

IHG

అయినా సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్న వారిలో చాలా భయాలు ఉన్నాయి. ముఖ్యంగా ముద్దులు, కౌగిలింతల సీన్ల విషయంలో ఇబ్బంది ఎదురవనుంది. అయితే స్టార్ హీరోయిన్ రెజీనా కెసాండ్రా అలాంటి సీన్లలో నటించనని చెబుతోంది. అలాంటి సీన్లలో నటించడానికి చాలా భయంగా ఉందట. కరోనా ఉధృతి రోజు రోజుకీ పెరుగుతుండడంతో ఇంటిమేట్ సీన్లకి కొన్ని రోజులు దూరంగానే ఉండాలని భావిస్తోందట

మరింత సమాచారం తెలుసుకోండి: