2006, ఏప్రిల్ 28 వ తేదీన విడుదలైన పోకిరి సినిమాలో మహేష్ బాబు, ఇలియానా, ప్రకాష్ రాజ్ షాయాజి షిండే ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. సినిమా కథ గురించి చెప్పుకుంటే పండు( మహేష్ బాబు) అనే మాఫియా వ్యక్తి డబ్బుల కోసం ఎవరినైనా చంపేస్తుంటాడు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు కానీ చెబుతూ పండు రౌడీలను విపరీతంగా కొట్టేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాను మొదటి చూపులోనే శృతి( ఇలియానా) ని ప్రేమిస్తాడు కానీ ఆమెకు తన ప్రేమ గురించి చెప్పడానికి భయపడుతుంటాడు. శృతి కూడా పండు ఒక మాఫియా క్రిమినల్ అని పనీపాటా లేకుండా ఖాళీ ఖాళీగా తిరుగుతూ ఉండే పండు ని ఎలా ప్రేమించాలి అని ఆలోచనలో పడుతుంది. 


అయితే పండు పెద్ద రౌడీ అయిన అలీ భాయ్ (ప్రకాష్ రాజు) చేసే అక్రమాలకు అన్యాయాలకు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తుంటాడు. తదనంతరం అతడిని పండు ఎలా అణచివేస్తాడన్నది ఈ సినిమాలో చూపించబడింది. అప్పటివరకు పండు ఒక గ్యాంగ్ స్టార్ అని నమ్మిన వారందరికీ అతడు ఒక నిజమేనా ఐపీఎస్ అధికారి అని, అతడి పేరు కృష్ణ మనోహర్ అని ప్రేక్షకులకు పూరి జగన్నాథ్ చూపించి పెద్ద ఝలక్ ఇస్తాడు. ఆ తర్వాత మహేష్ బాబు నటన పూర్తిగా మారిపోతుంది. పోలీస్ గా తన చూపించిన నటనా చాతుర్యం ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమాని ఒక మహేష్ బాబు తప్ప మరే ఇతర హీరో చేయలేడనే భావన ప్రేక్షకులకు తప్పకుండా వస్తుంది.

 

కేవలం మాస్ ఆడియన్స్ ని మాత్రమే కాదు మల్టీప్లెక్స్ ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించింది పోకిరి సినిమా. అద్భుతమైన నటుడు మహేష్ బాబు కి పవర్ ఫుల్ క్యారెక్టర్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ని ఎంతో మంది ప్రేక్షకులు ఇప్పటికీ పొగుడుతారు అంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాంధ్ర యాసలో మహేష్ బాబు చెప్పే డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలీ భాయ్ సూర్యనారాయణని చంపేసినప్పుడు... ఐపీఎస్ కృష్ణ మనోహర్ తన తండ్రిని చూడడానికి పోలీస్ బలగాలతో ఎంట్రీ ఇచ్చే సన్నివేశం ప్రేక్షకుల రోమాలను నిక్క పొడిచేలా చేస్తాయని చెప్పవచ్చు. ఎస్ఐ పశుపతి( ఆశిష్ విద్యార్థి) కి ఐపీఎస్ అధికారి కృష్ణ మనోహర్ చూపించే టార్చర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఎస్ఐ పశుపతికి అలీ భాయ్ గ్యాంగ్ తో సంబంధాలు ఉండడంతో అతడి నుండి సమాచారం సంపాదించి అలీ భాయ్ గ్యాంగ్ లోని వారిని ఒక్కరిని చంపుతాడు మనోహర్. ఈ సన్నివేశాల్లో మహేష్ బాబు చాలా అద్భుతంగా నటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: