సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏ హీరో అయినా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తే ఆ సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోతాయి, దీంతో సినీ ప్రేక్షకులు అందరూ ఆ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇలా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతమంది హీరోలు నటిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ దైన స్టైల్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పిస్తూ ఉంటారు . అయితే కొంతమంది పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో అలరించి తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు ...

 

 కొంతమంది పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ  తమదైన కామెడీని పంచుతూ అద్భుతంగా రాణిస్తూ ఉంటారు అని చెప్పాలి.  ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కామెడీని పంచినవారు ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు ఉన్నప్పటికీ వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు అంటే తెలుగు ప్రేక్షకులు అదో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడుతుంది. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఇప్పటికే చాలాసార్లు మెప్పించాడు సీనియర్ హీరో వెంకటేష్. 

 


 ఇక ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించినప్పటికీ తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించారు వెంకటేష్ బాబు బంగారం సినిమాలో . వెంకటేష్ హీరోగా తెరకెక్కిన బాబు బంగారం సినిమా లో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడు వెంకటేష్. అదే సమయంలో ఆ పాత్రలో తనదైన కామెడీని పండిస్తూ అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాడు. ఓవైపు యాక్షన్ సన్నివేశాలతో అదరగొడుతునే  మరోవైపు కామెడీ టైమింగ్తో ఇరగదీస్తాడు విక్టరీ వెంకటేష్. అందుకే బాబు బంగారం సినిమా లోనుంచి వెంకటేష్ పాత్ర తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: