తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోలు పోలీస్ పాత్రలో నటించి తనదైన పవర్ఫుల్ హీరోయిజం తో మెప్పించిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఎంత మంది హీరోలు పోలీస్ పాత్రల్లో  నటించినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన పోలీస్ పాత్ర మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా టెంపర్. ఈ సినిమా టైటిల్ కి తగ్గట్లు గానే స్టోరీ కూడా ఉంటుంది. అయితే ఈ సినిమా విడుదలయ్యే ముందే దర్శకుడు పూరీజగన్నాథ్  ఇక నుంచి ఎన్టీఆర్ కెరీర్ టెంపర్ కు ముందు టెంపర్ కి తర్వాత అని ఉంటుంది  చెప్పాడు. 

 

 టెంపర్ సినిమా విడుదలైన తర్వాత ఇది నిజమే అనిపించింది తెలుగు ప్రేక్షకులకు. టెంపర్ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ ఆ పాత్రలో ఎన్నో రకాల వేరియేషన్స్ చూపించి తెలుగు ప్రేక్షకులందరికీ ఫిదా చేశాడు. సినిమాలో  ఎన్టీఆర్ నటనకి ఫిదా అవని తెలుగు ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకొని... దయ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రకు ప్రాణం పోసాడు అనే చెప్పాలి, అప్పుడు వరకు ఎంతో మంది హీరోలు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. 

 

 కానీ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా మాత్రం  కొత్త ట్రెండ్ ను సృష్టించి టాలీవుడ్ ప్రేక్షకులు అందరిని మెప్పించింది. ఇక ఈ సినిమాలో మొదట లంచాల కోసం ఎగబడి అవినీతికి పాల్పడి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఒక్క సంఘటనతో మారిపోవడం... ఆ తర్వాత విలన్ కి చుక్కలు చూపించటం ..  ఇదంతా ఈ సినిమా స్టోరీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో ప్రతి డైలాగు కూడా సినిమా చూస్తున్న ప్రేక్షకుల మదిని తాకుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. సమాజంలో ఉన్న వాస్తవాలను బయట పెడుతూనే.. విలువలను గుర్తు చేశారు దర్శకుడు పూరి జగన్నాథ్.

మరింత సమాచారం తెలుసుకోండి: