సినీ పరిశ్రమలో ఎంతో మంది హీరోలు పోలీస్ పాత్రల్లో  నటిస్తూ ఉంటారు కానీ కొంతమంది హీరోలు పోలీస్ పాత్రలో నటిస్తే మాత్రం... ఎవరు కూడా అంత ఒదిగిపోయి పోలీస్ పాత్రలో నటించలేరేమో అని సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అనిపిస్తుంది. అంతేకాకుండా అంత అద్భుతంగా వేరే ఏ హీరో కూడా పోలీస్ పవర్ చూపించలేరు అని అనిపిస్తూ ఉంటుంది ప్రేక్షకులకు.. ఇలా పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే హీరో ఎవరు అంటే తమిళ హీరో సూర్య అని చెప్పాలి. సూర్య పోలీస్ పాత్రలో నటించాడు అంటే అది సూపర్ హిట్ కావడం ఖాయం. 

 

 మామూలుగానే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఆకర్షిస్తూ ఉంటాడు సూర్య. ఇక పోలీసు పాత్రలో అయితే ఇరగదీస్తాడు ఉంటాడు. పోలీస్ పాత్రలో  సూర్య చెప్పే డైలాగులు... సూర్య చేసే యాక్షన్ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ముఖ్యంగా సూర్య హీరోగా వచ్చిన సింగం మూడు పార్ట్ లు కూడా ప్రేక్షకులను అద్భుతంగా అలరించి సంచలన విజయాన్ని నమోదు చేశాయి. ఈ సినిమా ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూనే  ఉంటుంది. సింగం సినిమా లో సూర్య చేసే యాక్షన్ కి ఫిదా అవ్వని  సినిమా ప్రేక్షకుడు లేడు అనడంలో అతిశయోక్తి లేదు. 

 


 అసలు సిసలైన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటాడో సింగం సినిమాలో చేసి చూపిస్తాడు తమిళ హీరో సూర్య, సింగం సినిమా లో సూర్య గెటప్ కూడా పోలీస్ పాత్రకు సరిగ్గా సరిపోతుంది. సూర్య గెటప్ చూస్తుంటేనే  పోలీస్ పాత్ర లో ఉండే పవర్ ఏంటో కనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు సూర్య లాగా ఎవరు పోలీస్ పాత్రకు సూట్ కారేమో... ఆయన అంత పవర్ఫుల్ గా పోలీస్ పాత్రను పండించారు ఏమో అనిపిస్తూ ఉంటుంది. ఏదేమైనా పోలీస్ పాత్రలు చేయాలంటే మాత్రం సూర్య నే  చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: