మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కి ఫోన్ చేసి సలహా అడిగినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. రామ్ చరణ్ లాస్ట్ సినిమా 'వినయ విధేయ రామ' దారుణంగా అట్టర్ ఫ్లాప్ అవడంతో ప్రజెంట్ 'RRR' సినిమా చేస్తున్నా గాని అందులో ఎన్టీఆర్ ఉండటం జరిగింది. ఈ సినిమా తర్వాత ఎటువంటి జోనర్ కలిగిన సబ్జెక్టు చెయ్యాలి అన్న దానిపై రామ్ చరణ్ కి క్లారిటీ లేకుండా పోయిందట. దీంతో లాక్ డౌన్ తో పాటు సినిమా ధియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయో అన్న దాని విషయంలో క్లారిటీ లేకుండా పోయింది.

IHG

ఇలాంటి గజిబిజి పరిస్థితుల మధ్య తన నెక్స్ట్ సినిమా సోలోగా రావాలి కాబట్టి ఎలాంటి సబ్జెక్టు తో చేయాలి అన్న దాని గురించి చెర్రీ కన్ఫ్యూజన్ లో పడ్డారట. ఇలాంటి పరిస్థితుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సలహా తీసుకోవాలని తను ఎలాంటి కథ చేస్తే బాగుంటుంది అనే గైడ్ లైన్స్ మరియు అలాగే కొన్ని కథలు విని సజెస్ట్ తయారు చేయమని రామ్ చరణ్ త్రివిక్రమ్ ని కోరాడట.

IHG

'RRR' సినిమా తర్వాత రామ్ చరణ్ చెయ్యబోయే డైరెక్టర్ల లిస్టు పేర్లు ఎక్కువగానే వినబడ్డాయి. గౌతమ్ తిన్ననూరి, వెంకీ కుడుముల, త్రివిక్రమ్, కొరటాల శివ లాంటి డైరెక్టర్ ల పేర్లు వినబడ్డాయి. కానీ వీళ్లలో ఎవరికీ చరణ్ ఇంకా ఫిక్స్ కాలేదు. ఇలాంటి సమయంలో త్రివిక్రమ్ డైరెక్టర్ ని తనకోసం స్టోరీ రాయమని చరణ్ చెప్పడం బట్టి చూస్తే నెక్స్ట్ చరణ్... త్రివిక్రమ్ తో సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: