మా హీరో గొప్ప అంటే.. మా హీరో గొప్ప అంటూ పోటీ పడుతున్నారు ప్రభాస్, అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఒకరు సౌత్ ఇండియాలోనే హయ్యెస్ట్ ఫాలోవర్స్ ఉన్న హీరో అనీ.. మరొకరు సౌత్ ఇండియాలో మోస్ట్ లైక్డ్ స్టార్ అని హంగాామా చేస్తున్నారు. ఇక ఈ రచ్చ చూసి మిగతా వాళ్లు నవ్వుకుంటున్నారు. 

 

ప్రభాస్, అల్లు అర్జున్ మధ్య ఆసక్తికరమైన పోటీ నడుస్తోంది. పాన్ ఇండియన్ మార్కెట్ ను టార్గెట్ చేసిన ఈ హీరోల సోషల్ మీడియా ఫాలోయింగ్ పైనా చర్చలు నడుస్తున్నాయి. బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఫాలోవర్స్ ని, సదరన్ స్టార్ అల్లు అర్జున్ ఫేస్ బుక్ లైక్స్ ని కంపార్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ లతో హంగా చేస్తున్నారు అభిమానులు. 

 

ప్రభాస్ ఫేస్ బుక్ లో 14 మిలియన్ల మార్క్ చేరేకున్నాడు. ఈ హీరోకు ఫేస్ బుక్ లో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సౌత్ ఇండియాలో ఇన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న ఒకే ఒక్క హీరో ప్రభాస్. దీంతో బాహుబలి ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందని ప్రచారం చేస్తున్నారు అభిమానులు. 

 

అల్లు అర్జున్ ఫేస్ బుక్ పేజీకి 13మిలియన్లకు పైగా లైక్స్ ఉన్నాయి. సౌత్ ఇండియాలో ఇంతమొత్తం లైక్స్ ఉన్న హీరోగా బన్నీ చరిత్ర సృష్టించాడు. దీంతో మోస్ట్ లైక్డ్ సౌత్ స్టార్ ఏఏ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అయితే తెలుగు హీరోలిద్దరి గురించి అభిమానులు ఇలా పోటీపడటం చూసి మిగతా ఇండస్ట్రీ వాళ్లు నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ పోటీపడుతున్నారా అని మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ అల్లు అర్జున్, ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా చెప్పేస్తున్నారు. దీంతో హీరోల అభిమానుల మధ్య గట్టి పోటీ అయితే నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: