సినిమా రిలీజ్ అవ్వాలంటే సెన్సార్ తప్పనిసరి. కానీ.. ఇప్పుడు ఏకంగా డైరక్ట్ గా ఓటీటీల్లో రిలీజ్ అయిపోతున్నాయి. తెరపై వచ్చే సినిమాలకు సెన్సార్ ఉంది కానీ.. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పై వచ్చే సినిమాలకు సెన్సార్ లేకపోయింది. దీంతో సినిమాలో అడల్ట్ కంటెంట్ నుంచి వివాదాస్పద కంటెంట్ కూడా ఉంటోంది. ప్రస్తుతం ఇదే విషయమై ఇంటర్నెట్ లో ఓ హ్యాష్ ట్యాగ్ నడుస్తోంది. #boycottneflix పేరుతో ఓ హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అవుతోంది. కారణం.. రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు సినిమా ‘కృష్ణ అండ్ హిస్ లీల’ గురించే.

IHG

 

దగ్గుబాటి రానా నిర్మతగా వచ్చిన ఈ సినిమా జూన్ 25న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. అయితే సినిమాలో హీరో పాత్ర పేరు ‘కృష్ణ’ అని పెట్టి అమ్మాయిల చుట్టూ తిరుగుతూ విపరీతమైన శృంగార కాంక్ష ఉన్నవాడిగా చూపించడమే ఇందుకు కారణం. ఈ సినిమాలో కృష్ణ పేరుతో హీరోకి క్యారెక్టర్ లేకుండా చేసి హిందువుల మనోభావాలు దెబ్బ తీశారంటూ నెట్టింట్లో ఫైర్ అవుతున్నారు. ఏకంగా బ్యాన్ నెట్ ఫ్లిక్స్ అంటూ సినిమాను రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్ పై పడ్డారు కూడా. నెట్ ఫ్లిక్స్ లో గతంలో కూడా పలు సినిమాలను ఇలానే ప్లే చేసిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

IHG

 

‘ఈ వెబ్ సిరీస్ ను ఎలా ప్రదర్శిస్తారు.. నెట్ ఫ్లిక్స్ ను బ్యాన్ చేయాల్సిందే.. హిందూ దేవతలను కించపరస్తూ తీసే వెబ్ సిరీస్ లను కూడా నెట్ ఫ్లిక్స్ ప్రోత్సహిస్తోంద’ని నెటిజన్లు ఫైర్ అయిపోతున్నారు. నెట్ ఫ్లిక్స్ పై గతంలోనే వివాదాలు వచ్చినా ఇప్పుడో తెలుగు వెబ్ సిరీస్ ద్వారా మరింత వివాదంలోకి వచ్చింది. ఈ సినిమాలో కంటెంట్ ను రానా ఎలా యాక్సెప్ట్ చేశాడు అంటూ మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: