పవన్ కళ్యాణ్ వేసినవి అన్నీ కూడా సాంఘిక చిత్రాలే. ఇక పవన్ కళ్యాణ్ ఇపుడు తొలిసారిగా క్రిష్ డైరెక్షన్లో విరూపాక్ష అనే ఒక హిస్టారికల్ మూవీలో చేస్తున్నట్లుగా చెబుతున్నారు. పవన్ పౌరాణికాలు అంటే ఇష్టపడతాడు, పాత సినిమాలు అంటే పిచ్చి అని అందరూ అంటారు. ఆయన మాత్రం ఎపుడూ ఆ వైపుగా కనీసం ట్రై చేయలేదు.

IHG

ఇక పవన్ సోషల్ సినిమాల్లో రాముడు మంచి బాలుడు లాంటి పాత్రల కంటే మాస్ పాత్రలు ఎక్కువగా వేశారు. ఇపుడు రీ ఎంట్రీతో పవన్ కళ్యాణ్ అలాంటి మంచి వాడి పాత్రలో నటిస్తున్నారుట. ఆ పాత్ర కూడా సమాజంలో  ఉన్నత వ్యక్తిత్వం కలిగిన లాయర్ పాత్ర. అదే వకీల్ సాబ్. ఈ పాత్రలో పవన్ రాముడిగా మారి రావణులను చెండాడితే ఆయన తో పోటీ పడుతూ  సీతమ్మ  అంజలి నటిస్తుందని తెలుస్తోంది.

IHG

దీనికి సంబంధించి  పవన్ సినిమాలో తాప్సీ పాత్రకు సెలెక్ట్ చేసిన  హీరోయిన్ని ఇంతవర‌కూ ఎక్కడా రివీల్ చేయలేదు. కానీ ఇపుడు మాత్రం వదిలారు. ఫుల్ టేడిషనల్ గా అంజలి కనిపించే పిక్ అది. మరి పవన్ తో పాటుగా ధీటుగా  అంజలి  తాప్సీ  పాత్ర పోషిస్తోందా అన్నది చూడాలి. ఇక అంజలి తెలుగులో ఇప్పటికే బాలయ్య, వెంకటేష్ ల పక్కన నటించింది 

IHG' in newfilmstills.com | Scoop.it

ఆమెకు అందం, చందం అన్నీ ఉన్నా కూడా అవకాశాలు రాలేదు. అయితే ఇపుడు పవన్ వకీల్ సాబ్ తో మంచి అవకాశాలు వస్తాయని అంతా భావిస్తున్నారు. మరి ఇంతకీ వకీల్ సాబ్ పక్కన ఎలాంటి  పెర్ఫార్మెన్స్ అంజలి ఇచ్చింది అన్నది సినిమా చూస్తేనే అర్ధమవుతుంది అంటున్నారు. సో వెయిట్ అండ్ సీ.

మరింత సమాచారం తెలుసుకోండి: