ఇప్పుడు సినీ పరిశ్రమ ఎక్కువగా ఆధారపడుతూ వస్తుంది ఓటీటీ మీదనే అనే విషయం దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. ఓటీటీ లో సినిమాలను విడుదల చెయ్యాలి అంటే నిజంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి ఆధారంగా చూస్తే ధైర్యం అనేది చాలా అవసరం అనే సంగతి తెలిసిందే. అయినా సరే ఓటీటీ లో సినిమా విడుదల చేసే విషయంలో కొందరు నిర్మాతలు గాని దర్శకులు గాని ఏ విధంగా కూడా భయపడటం లేదు అనే చెప్పాలి. అవును ఇప్పుడు నటులు ఓకే అంటే చాలు ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడానికి గానూ రెడీ అంటున్నారు. 

 

ఇక ఓటీటీ సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి. ఇక బెస్ట్ ఓటీటీ సినిమా ఏదీ అంటే కచ్చితంగా  ఇప్పుడు చెప్పే సినిమా పెంగ్విన్. అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఈ సినిమా చాలా చాలా బాగా నచ్చింది అనే టాక్ వినపడుతుంది. ఓటీటీ లో సినిమాను విడుదల చేయడానికి కీర్తి సురేష్ రెడీ అనడం తో సినిమాను విడుదల చేయగా దానికి మంచి స్పందన వస్తుంది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది అనే చెప్పాలి. ఆ సినిమా యూనిట్ కూడా ఆ ఫలితం చూసి ఇప్పుడు ఫుల్ హ్యాపీ గా ఉంది అనే చెప్పాలి. 

 

ఇక కథ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్న నేపధ్యంలో చిత్ర యూనిట్ కి మంచి హిట్ దొరికింది అనే చెప్పాలి.  ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన కు చాలా మంచి మార్కులు పడ్డాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆమె మరో సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి గానూ రెడీ అయింది అని టాక్ మరి. ఆ సినిమాను ఆమె ఎప్పుడు విడుదల చేస్తుంది అనేది చూడాలి. ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: