మాములుగా హీరోయిన్స్ ఎఫైర్ల గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. మీడియా లీక్ చేసే వరకు వాళ్లు చేస్తున్న వ్యవహారం గురించి సీక్రెట్ గా ఉంచుతారు. కాని అందరిది ఒకదారి తనదో దారి అన్నట్టుగా అవును నాకు ఎఫైర్లు ఉన్నాయని చెప్పి షాక్ ఇచ్చింది ప్రేమకావాలి బ్యూటీ ఇషా చావ్లా. టాలీవుడ్ లో ఇలా వచ్చి అలా వెళ్లిన ఈ అమ్మడు సినిమాలకు దూరంగా ఉంటుంది. చేసింది మూడు నాలుగు సినిమాలే అయినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఇషా చావ్లా లేటెస్ట్ గా తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో టచ్ లోకి వచ్చింది. అంతేకాదు ఛానెల్ కు స్పెషల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చింది.

 

హీరోయిన్ ఇంటర్వ్యూ అంటే చాలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా..  పెళ్లెప్పుడు అనే ప్రశ్నలు కామన్. కాని ఇషాతో అలా కాకుండా తనపై వచ్చిన ఎఫైర్ల రూమర్ల గురించి మాట్లాడింది ఈషా చావ్లా. తనకు ఒకరితో కాదు ఇద్దరితొ ఎఫైర్ నడిచిందని.. ఒకరితో లాంగ్ రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేయగా మరొకరితో మాత్రం చాలా తక్కూ రోజులు రిలేషన్ ఉందని చెప్పింది. అయితే ఇద్దరితో కూడా రిలేషన్ షిప్ మధ్యలోనే బ్రేకప్ అవడం గురించి చెప్పింది ఈషా చావ్లా. 

 

సినిమాలు అవకాశాలు రాకున్నా ఇప్పటికి మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నా అంటుంది అమ్మడు. ఏది పడితే అది చేయడానికి సిద్ధం కాదని చెబుతున్న ఈషా అలాంటి ఆఫర్లు చాలా వచ్చాయని కాకపోతే అలాంటి సినిమాలు చేయడం తన వల్ల కాదని అంటుంది ఈ హీరోయిన్. బాలకృష్ణతో శ్రీమనారాయణ సినిమాలో నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత అడ్రెస్ లేకుండాపోయింది.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: