టాలీవుడ్ లో ఓ మీడియం రేంజ్ ఉన్న హీరో.. అప్పటికే అతనితో రెండు సినిమాలు తీసి హిట్టు కొట్టిన డైరక్టర్ తో కలిసి హ్యాట్రిక్ మూవీ చేశాడు. ఈ సినిమాలో అతను నెగటివ్ రోల్ చేస్తున్నట్టుగా ప్రచారం మొదలుపెట్టారు. సినిమాలో అతనే కాకుండా మరో యంగ్ హీరో కూడా నటించాడు. ఇద్దరు అందాల భామలు కథానాయికలుగా చేశారు. రిలీజ్ టైం దగ్గర పడటం కరోనా ఎఫెక్ట్ తో సినిమా హాళ్లను బంద్ చేయడం అంతా ఒకేసారి జరిగింది. ఆ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో సినిమా నుండి కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి.

 

సినిమాలో హీరో విలన్ గా నటించాడని తెలిసిందే. అయితే టాలెంటెడ్ డైరక్టర్ ఒక జన్మలో హీరో.. నెక్స్ట్ జన్మలో విలన్ గా నటిస్తాడట. ఇక ఈ జన్మలో ఆ హీరో విలన్ గా చేస్తే గత జన్మలో విలన్ ఇప్పుడు హీరోగా కనిపిస్తాడట. మొత్తానికి ఈ సస్పెన్స్ రివీల్ అయ్యే టైం కు ఆడియెన్స్ సూపర్ అనేస్తారట. అయితే ఇదే కథతో ఆ క్రేజీ సినిమా తెరకెక్కిందని.. సినిమా కథ లీక్ అవడంతో చిత్రయూనిట్ కంగారు పడుతున్నారు. కథ మొత్తం లీక్ అయినా స్క్రీన్ ప్లేతో చూస్తే ఆ కిక్ వేరేలా ఉంటుంది.

 

ఇక తన మార్క్ స్క్రీన్ ప్లే రైటింగ్ లో దిట్ట అయిన ఆ దర్శకుడు కథ లీక్ అయిన విషయాన్ని అసలు పట్టించుకోవడం లేదు. మరి నిజంగానే ఆ క్రేజీ సినిమా కథ అదేనా.. ఒకే అక్షరంతో వస్తున్న ఈ సినిమా విజయానికి అవకాశాలు ఎన్ని ఉన్నాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది.. ఓటిటి లో రిలీజ్ చేయమన్న దర్శక నిర్మాతలు సినిమాను ఎప్పుడు ఎలా రిలీజ్ చేస్తారో తెలియాల్సి ఉంది.          

మరింత సమాచారం తెలుసుకోండి: