వివాదాలని కథాంశాలుగా ఎంచుకుని సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ క్రాఫ్ట్ మీద దృష్టి పెట్టి చాలా రోజులు అయిందని చెప్పుకుంటారు. ఆయన తీసే సినిమాల్లో ఒకప్పుడు ఉండే ఇంటెన్సిటీ ఉండట్లేదని, కేవలం వివాదాలనే సినిమారూపంలో తీసుకువచ్చి జనాల మీదకి వదులుతుంటాడని టాక్ ఉంది. అయితే కరోనా టైమ్ లో రామ్ గోపాల్ వర్మ సూపర్ సక్సెస్ డైరెక్టర్ అని చెప్పుకుంటున్నాడు.

 

కరోనా వల్ల సినిమా షూటింగులు ఆగిపోయి, థియేటర్లు మూతబడిపోవడంతో అన్ని సినిమాల షూటింగులు ఆగిపోయాయి. రిలీజ్ కావాల్సిన చిత్రాలు ల్యాబ్ కే పరిమితమయ్యాయి. ఈ టైమ్ లో రామ్ గోపాల్ వర్మ తనని కరోనా ఏం చేయలేదని, థియేటర్లు లేకపోయినా తనకేమీ నష్టం రాదంటూ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే తానేమీ నష్టపోవట్లేదు సరికదా లాభాల బాటపడుతున్నాడు.

 

కరోనా క్రైసిస్ టైమ్ లో అందరూ కరోనా బారిన పడకుండా ఉండాలని చూస్తుంటే తాను మాత్రం మియా మాల్కోవాతో ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న కంటెంట్ ని తీసి క్లైమాక్స్ అనే చిన్న సైజు చిత్రాన్ని రిలీజ్ చేసాడు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ పేరుతో ఎనీటైమ్ థియేటర్ అనే కొత్త పేరుతో వెబ్ సైట్ లాంచ్ చేసి అక్కడ తన క్లైమాక్స్ ని వందరూపాయలు ఫీజు చెల్లించి చూసే విధంగా చేసాడు. మియా మాల్కోవా నటించిన ఈ క్లైమాక్స్ ని చూడడానికి జనం ఎగబడడంతో సర్వర్ క్రాష్ అయింది.

 

ఆ తర్వాత మళ్లీ నేక్డ్ నంగా నగ్నం అనే పేరుతో మరో షార్ట్ ఫిలిమ్ ని అదే యాప్ లో రిలీజ్ చేసాడు. కేవలం ఐదు లక్షలతో రూపొందించిందని చెప్పబడుతున్న ఈ షార్ట్ ఫిలిమ్ కి 80లక్షలకి పైగా రెవెన్యూ వచ్చిందట. అంటే కరోనా టైమ్ లో మోస్ట సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మే అని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: