టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తారక్ సినిమా వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. అతని సినిమా కోసం కచ్చితంగా థియేటర్ కి వెళ్ళే ఫాన్స్ కూడా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక సినిమాల విషయంలో తారక్ చూపించే శ్రద్ధ అతను తీసుకునే జాగ్రత్తల గురించి అందరికి తెలిసిన విషయమే. ప్రతీ ఒక్కటి కూడా జాగ్రత్తగా చూస్తూ సినిమాలు చేస్తూ ఉంటాడు తారక్. ఇక ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో తారక్ కొమరం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతని పాత్ర ఏ విధంగా ఉంటుంది అసలు ఏ విధంగా చూపిస్తాడు దర్శకుడు అనే ఆలోచన అందరిలో ఉంది. ఇక ఇప్పుడు ఒక వార్త ఏంటీ అంటే... ఈ సినిమా కథలో తారక్ పాత్ర కేవలం గతం అని అంటున్నారు. అవును మొదటి భాగంలో మాత్రమే అతని పాత్ర ఉంటుంది అని రెండో భాగంలో చాలా తక్కువగా ఉంటుంది అని ఒక పోలీస్ అధికారి కక్ష సాధించే విధంగా తారక్ పాత్ర ఉంటుంది అని సమాచారం. 

 

దీనికి సంబంధించి తారక్ ఎన్నో విధాలుగా కష్టపడి సినిమాను చేస్తున్నాడు అని అంటున్నారు. అతను అడవిలో బురదలో ఒక ఫైట్ చెయ్యాలి అని ఆ సీన్ కోసం చాలా వరకు కష్టపడుతున్నాడు అని అంటున్నారు. సినిమాలో ఆ సీన్ అసలు ఆలస్యం అవుతుంది అని తారక్ మినహా డూప్ చేస్తే ఆ పాత్రకు అంత అందం రాదు అని భావించి దర్శకుడు తారక్ నే చెయ్యాలి అని కోరినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: