టాలీవుడ్ లో సైలెంట్ గా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు శేఖర్ కమ్ముల. ఆయన సినిమాలు అనగానే ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ అనేది ఉంటుంది. సినిమా ఏ విధంగా ఉన్నా సరే అందులో ఉండే కొన్ని కోణాలు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతాయి అనే సంగతి అందరికి తెలిసిందే. సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అతను అగ్ర హీరోలతో కంటే ఎక్కువగా యువ హీరోలు చిన్న హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. వారికి తగిన విధంగానే కథలను రాస్తూ ఉంటారు. 

 

ఇప్పుడు నాగ చైతన్య హీరో గా ఆయన ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ కూడా పూర్తి అయింది. సాయి పల్లవి హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా టైటిల్ లవ్ స్టోరీ అని తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమాను లైన్ లో పెట్టారు. లవ్‌స్టోరీ` తర్వాత శేఖర్ తెరకెక్కించబోయే సినిమాలో సీనియర్ హీరో వెంకటేష్ అని టాక్. వెంకటేష్ కోసం లాక్ డౌన్ లో అతను ఒక కథ రెడీ చేసారు అని దానికి వెంకటేష్ కూడా ఓకే చెప్పారు అని సమాచారం. వెంకటేష్ ప్రస్తుతం నారప్ప అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. 

 

సినిమా వచ్చే ఏడాది రానుంది ప్రేక్షకుల ముందుకి. ఈ సినిమా తర్వాత ఆయన... శేఖర్ దర్శకత్వంలో సినిమా చేయడం ఖాయమని టాలీవుడ్  వర్గాలు అంటున్నాయి. ఏది ఎలా ఉన్నా సరే ఈ సినిమా కథ పై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక లవ్ స్టోరీ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివర్లో రానుంది ఈ సినిమా అని టాక్... చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: