వేణు శ్రీరామ్ దర్శక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిపోయి ఉంది. ఓ నెలరోజుల బ్యాలెన్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో 'పింక్' సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్ర చేస్తున్నారు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు.

IHG's upcoming film goes ...

2018వ సంవత్సరంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్సినిమా చేయలేదు. దాదాపు రెండు సంవత్సరాలు రాజకీయరంగంలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో మొట్టమొదటిసారి 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాడుతూనే మరోపక్క మళ్లీ సినిమారంగంలో పవన్ రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

IHG

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలి నటిస్తున్నట్లు ఇటీవల రిలీజ్ అయిన ఓ చిన్నపాటి వీడియో క్లిప్ లో తెలుస్తోంది. గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేష్ పక్కన హీరోయిన్ గా నటించిన అంజలి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఈ నేపథ్యంలో ‘వకీల్ సాబ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ పక్కన హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినబడినా చివరాకరికి అంజలిని సినిమా యూనిట్ కన్ఫామ్ చేసినట్లు టాక్ నడుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: