హిందీ సినిమా పరిశ్రమలో కపూర్ ఫ్యామిలీ ఓ వ్యవస్థ. ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి సూపర్ స్టార్ డమ్ సాధించిన హీరోయిన్ కరీనా కపూర్. బెబో.. అనే ముద్దు పేరుతో ఫేమస్ అయిన కరీనా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించింది. జీరో సైజ్ తో ఇండియాలో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది కరీనా. హీరోయిన్ గా ఆమె తెరంగేట్రం చేసి నేటికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2000 జూన్ 30న విడుదలైన ‘రెఫ్యూజీ’ సినిమాతో బాలీవుడ్ లో పరిచయమైంది. ఈ సందర్భంగా తన ఇన్ స్టా అకౌంట్ లో తన అనుభవాలు పంచుకుంది.

IHG

 

‘హీరోయిన్ గా 20ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన జేపీ దత్తా గారికి థ్యాంక్స్. ఈ కెరీర్ ను నేను బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా హీరోయిన్ గా నటించి హీరోయిన్లకు సినిమా లైఫ్ తక్కువనే మాట తప్పని నిరూపించాలని నా కోరిక. పెళ్లయింది.. ఓ బాబు కూడా ఉన్నాడు. ఇంకా హీరోయిన్ గా ఉంటూ ఇంత ఆనందంగా ఉన్నానంటే కారణం నా ఫ్యాన్స్, ప్రేక్షకులు నన్ను ఆదరించడం వల్లనే అంటూ రెఫ్యూజీలో తన మీద తెల్లవారుఝామున 4గంటలకు షూట్ చేసిన పిక్ ను పోస్ట్ చేసింది.

IHG

 

కెరీర్లో వృత్తి నిబద్దతే ఇన్నేళ్ల నా ప్రయాణానికి దోహదపడింది. అభిషేక్ బచ్చన్ తో సహా అందరికీ థ్యాంక్స్. టైమ్ లో మళ్లీ 20ఏళ్లు వెనక్కు వెళ్లాలనుంది’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్దాలో నటిస్తోంది. హాలీవుడ్ లో వచ్చిన ‘ఫారెస్ట్ గంప్’కు ఈ సినిమా రీమేక్. ఇందులో తన పాత్ర చాలా బాగుంటుందని చెప్తోంది. ఈ సినిమా తర్వాత కరణ్ జోహార్ నిర్మించే ‘తక్థ్’లో నటిస్తోంది.

IHG

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My first shot was at 4 am... I woke up this morning at 4, looked in the mirror, and said to myself that this was the best decision I could have ever taken. 20 years of hard work, dedication, and self-confidence... ❤️ I am extremely grateful to all my fans for all your love, support, and strength... Thank you #JPDutta for my life in the movies... @bachchan for being the sweetest co-star... and every single person involved in this film. Want to go back in time... ❤️❤️ #20YearsAndNotGivingUp

A post shared by kareena kapoor Khan (@kareenakapoorkhan) on

 

మరింత సమాచారం తెలుసుకోండి: