జులై 4వ తేదీన ప్రసారమవుతున్న క్యాష్ ప్రోగ్రామ్ కి సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, సురేఖ వాణి తమ కూతుర్లతో వచ్చారు. ఈ ప్రోగ్రాం కి సంబంధించిన ఐదు నిమిషాల నిడివి గల ప్రోమో యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది. యాంకర్ సుమ హేమ సురేఖ వాణి లతో పాటు హేమ కుమార్తె అయిన ఇషా తో, సురేఖ వాణి కుమార్తె సుప్రీత తో బాగా మాట్లాడే వారి కుటుంబానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను బయట పెట్టింది. ప్రోమోలో మొదటిగా సుమ మాట్లాడుతూ...  సురేఖవాణి ఏ యాంగిల్ లో చూసినా మీరు అసలు తల్లీకూతుళ్ల లాగా ఉన్నారా? అని ప్రశ్నించగా... మీ పిల్లలు మీ పక్కన నిల్చుంటే మీరు కూడా అలానే ఉంటారు అని సురేఖ పంచ్ పిలుస్తుంది. ఆ తర్వాత సురేఖ వాణి కూతురు సుప్రీత సుమని ఉద్దేశిస్తూ ఇంతకీ మిమ్మల్ని అక్క అనాలా ఆంటీ అనాలా ఫ్రెండ్ అనాలా అని అడగ్గా... 'ఏదో ఒకటి అనమ్మా' అని సుమ సమాధానమిస్తుంది. 


తదనంతరం తల్లి కూతుర్లు సరదాగా పంచులు వేసుకుంటూ షోని రసవత్తరంగా, హాస్యాస్పదంగా మార్చేస్తారు. అలాగే తమ తల్లులు అంటే తమకు ఎంతో ఇష్టమైని ఎంత అల్లరి చేసినా ఏమి తిట్టరని,  కొట్టరని... స్నేహితుల్లా గా అన్ని రహస్యాలను చెబుతామని సుప్రీత, ఈషా చెప్పుకొచ్చారు. దీంతో ఇద్దరి క్యారెక్టర్ ఆర్టిస్టులు తమ కూతుళ్లను ఎంత మమకారంతో పెంచుతున్నారో తేటతెల్లమైంది. 


షో లో భాగంగా సుమా ఈ నలుగురితో బాస్కెట్ బాల్ ఆట ఆడించింది. గోల్ చేయలేకపోయిన వారితో బ్రేకింగ్ న్యూస్ ఆట ఆడి వారిని బాగా ఆట పట్టించింది. అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను... వీళ్ళిద్దరిలో ఎవరితో మీరు సినిమా చేయాలనుకుంటారు ప్రశ్నించినప్పుడు సురేఖ వాణి బోయపాటి శ్రీను అని చెప్పడంతో... అనిల్ రావిపూడి ఏం పాపం చేశారు అని ఆమెను ఒక ఆట ఆడుకుంది సుమ. ఏదేమైనా ఈ ప్రోమో నెటిజన్లను బాగా అలరిస్తుంది. మీరు కూడా ఒక లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: