మాస్‌రాజా అకౌంట్‌ నుంచి ఓ వికెట్‌ పడిపోయింది. రవితేజ ప్రస్తుతం గోపీచంద్‌ దర్శకత్వంలో క్రాక్ ‌మూవీ చేస్తున్నాడు. సినిమా సెట్స్‌పై ఉండగానే.. ముగ్గురు దర్శకులను లైన్ లో పెట్టాడు. అయితే.. కరోనా ప్రభావంతో... ఓ దర్శకుడితో సినిమా అటకెక్కింది. రవితేజను డైరెక్ట్‌ చేసే ఛాన్స్‌ మిస్‌ చేసుకున్న ఆ దర్శకుడు ఎవరంటే...  

 

ఏడాది గ్యాప్‌ తీసుకొని నటించిన డిస్కోరాజా ఫ్లాప్ అయ్యేసరికి ఇక గ్యాప్‌ ఇవ్వకుండా.. సినిమాల సినిమాలు చేసేయాలని రవితేజ డిసైడ్‌ అయ్యాడు. ఈ క్రమంలో క్రాక్‌ తర్వాత ముగ్గురు దర్శకులను లైన్ లో  పెట్టాడు. నాపేరు సూర్య... నా ఇల్లు ఇండియా ఫ్లాప్‌తో దర్శకుడిగా పరిచయమైన వక్కంతం వంశీకి  డెబ్యూ మూవీ ఫ్లాప్‌ కావడంతో... రెండేళ్లయినా.. మరో ఛాన్స్‌ దక్కలేదు. రవితేజ కెరీర్‌ బిగ్గెస్ట్‌ హిట్స్‌లో ఒకటైన కిక్‌కు కథ అందించిన వక్కంతంకు డైరెక్షన్‌ ఆఫర్‌ ఇచ్చాడు రవితేజ.

 

గతంలో తనకు ఫ్లాప్‌ మూవీ వీరు ఇచ్చిన రమేష్ వర్మ డైరెక్షన్‌లో నటించాలనుకున్నాడు రవితేజ. అలాగే.. రామ్‌తో హలోగురు ప్రేమకోసమే తీసిన త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా ఓకే చేశాడట. ఇలా మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడు రవితేజ. 

 

కారణం ఏమిటో తెలీదుగానీ.. రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ నటించడం లేదు. కథ నచ్చక వద్దనుకున్నాడో.. లేదంటే నిర్మాతే తప్పుకున్నారో తెలీదుగానీ.. రమేష్‌ వర్మతో రవితేజ సినిమా లేదని తెలుస్తోంది. మారిన పరిస్థితుల నేపథ్యంలో వక్కంతం వంశీ,, త్రినాథరావు సినిమాల బడ్జెట్‌ తగ్గించాలని రవితేజా కోరినట్టు తెలిసింది. 

 

మొత్తానికి రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ యాక్ట్ చేయడం లేదు. ఎవరు తప్పుకున్నారో తెలియదు గానీ ఇద్దరి కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. రవితేజ కొత్త మూవీ కోసం ఓ వైపు తన అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: