అభిమాన హీరో విజయ్‌ నుంచి  ఫ్యాన్స్‌  ఓ ఎనౌన్స్‌మెంట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా మూడు హిట్స్‌ ఇచ్చిన దర్శకుడితో మళ్లీ వర్క్‌ చేస్తున్నాడంటూ వార్తలొస్తున్నాయే గానీ.. అటు హీరోగానీ.. ఇటు దర్శకుడుగానీ స్పందించలేదు. అయితే.. ఓ సినిమాటోగ్రాఫర్‌ మాత్రం ఈ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతుందని హింట్‌ ఇచ్చాడు. విజయ్‌తో నాలుగో హిట్‌కు రెడీ అవుతున్న ఆ దర్శకుడు ఎవరో తెలుసా.. 

 

విజయ్‌, మురుగదాస్‌ది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌. ఈ కలయిక తుపాకి మూవీతో మొదలైంది.  కత్తి... సర్కార్‌ వంటి సూపర్‌హిట్స్‌ ఇచ్చారు. మళ్లీ కలయికలో సినిమా వస్తోందంటూ.. చాలాకాలంగా ప్రచారం సాగుతోందేగానీ.. ఎనౌన్స్‌మెంట్‌ మాత్రం రావడం లేదు. తుపాకి.. కత్తి... సర్కార్‌. ఒక సినిమాను మించి మరోటి హిట్‌ కావడంతో.. నాలుగో సినిమా గురించి ప్రేక్షకులతో పాటు ట్రేడ్‌ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. 

 

సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ సామాజిక మాద్యమంలో చేసిన పోస్ట్ తో  విజయ్‌, మురుగదాస్‌ కాంబో వుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. ‘తుపాకి’ సినిమాలోని ఫొటోను పోస్ట్‌  చేయడంతో.. ఈ హిట్‌ కాంబినేషన్‌ త్వరలో పట్టాలెక్కే అవకాశం మెరుగైంది. 

 

మురుగదాస్‌కు విజయ్‌.. విజయ్‌కు మురుగదాస్‌ కలిసొచ్చాడు. గజిని వంటి సూపర్‌హిట్‌ తర్వాత ఇదే హీరోతో మురుగదాస్‌ సెవెన్త్‌ సెన్స్‌ తీస్తే.. నిరాశపరిచింది. రజనీకాంత్‌తో తీసిన దర్బార్‌... మహేశ్‌తో స్పైడర్‌ ఫ్లాప్‌ అయ్యాయి. ఒక్క విజయ్‌కు మాత్రమే కంటిన్యూ హిట్స్ ఇవ్వడంతో.. ఈ కలయికపై ఆసక్తి నెలకొంది. 

 

మొత్తానికి విజయ్, మురుగదాస్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే వీరి కాంబినేషన్ అలాంటిది మరి. ఎవరికి సొంతం కాని హిట్స్ ఈ ఇద్దరికే ఉండటంతో సినీ అభిమానులు వీరి కాంబినేషన్ ఎపుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. చూద్దాం.. ముందు ముందు ఏం జరుగుతుందో.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: