చిన్న సినిమాలు... ఇప్పుడు టాలీవుడ్ లో ఈ మాట ఎక్కడా వినపడటం లేదు. ఎక్కడ చూసినా సరే అగ్ర హీరోల సినిమాలే గాని చిన్న హీరోల సినిమా అనే ప్రశ్న ఎక్కడా కూడా మనం వినడం లేదు అనే చెప్పాలి. స్టార్ హీరోల్ సినిమాల కోసమే జనాలు ఎదురు చూస్తున్నారు గానీ చిన్న హీరోల సినిమాల అనే మాట ఆడియన్స్ నుంచి కూడా పెద్దగా రావడం లేదు అనే చెప్పాలి. సినిమాకు ఇప్పుడు దాదాపుగా చాలా కష్టంగా ఉంది అనే చెప్పాలి. చాలా వరకు సినిమాలను విడుదల చెయ్యాలి అంటే భయపడుతున్నారు అనే విషయం అందరికి అర్ధమవుతుంది. 

 

ఈ తరుణంలో టాలీవుడ్ లో కొందరు స్టార్ హీరోలు చిన్న హీరోలకు అండగా ఉండాలి అనే ఒక నిర్ణయానికి వచ్చారు అని సమాచారం. అవును స్టార్ హీరోలు కొందరు చిన్న హీరోల సినిమాలను కొనడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. దానికి కారణం ఏంటీ అంటే చిన్న సినిమా లేకపోతే పెద్ద సినిమా ఉండదు. ఆడియన్స్ ఒక్కసారిగా సినిమాలకు దూరం అయ్యారు అంటే సినిమాలను చూడటానికి ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు కరోనా సమయం... చిన్న హీరోల సినిమాలు లేట్ అయ్యాయి అంటే అగ్ర హీరోల సినిమాలు విడుదల య్యే వరకు ఆగాలి. 

 

కాని ఆ పరిస్థితి ఇప్పుడు ఏ మాత్రం కూడా లేదు. అందుకే  ఇప్పుడు స్టార్ హీరోలు అందరూ కూడా చిన్న హీరోల సినిమాలను కొనుగోలు చేసి విడుదల చెయ్యాలి అని భావిస్తున్నారు అనే ప్రచార౦ మాత్రం జరుగుతుంది. రామ్ చరణ్ ఒక సినిమాను ఇప్పటికే కొన్నాడు అని సమాచారం మరి. ఇక ప్రభాస్ కూడా అదే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. నిజం ఎంత అనేది చూడాలి అంటే ఆగాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: