ఇప్పుడు దాదాపుగా హీరోయిన్ ల పరిస్థితి కాస్త ఇబ్బంది గానే ఉంది అనే మాట అందరికి తెలిసిందే. వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు చేసే హీరోయిన్ లను మాత్రమే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు అని చిన్న హీరోల సినిమాలు చేసే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అంటున్నారు. అగ్ర హీరోల సినిమాలు చేస్తున్న వారికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. చిన్న హీరోల సినిమాలు చేసే వారికి ఒక సినిమా రావడం కూడా చాలా కష్టంగా ఉంది అనే చెప్పాలి. 

 

అందుకే ఇప్పుడు జనాలు సినిమాలకు దూరంగా ఉన్నారని అంటున్నారు. హీరోయిన్ లు సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు అని టాక్. వారు వెళ్లి సొంత వ్యాపారాలు అదే విధంగా ఉద్యోగాలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. అవును స్టార్ హీరోయిన్ లు అందరూ కూడా సినిమాలతో బిజీ గా ఉన్న సమయంలో చిన్న హీరోయిన్ లు నానా ఇబ్బందులు పడుతున్నారట. అందుకే వారు అందరూ కూడా సినిమాలు వద్దు ఇంకా లాభం లేదని, 

 

ఇక దర్శక నిర్మాతల పక్కన తిరిగినా సరే లాభం లేదు అనే నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు. ఒక హీరోయిన్ అయితే ఏదో చిన్న ఆఫర్ వస్తే కూడా వద్దు అని చెప్పి ఆమె సొంత రాష్ట్రం వెళ్లిపోయింది అని చెప్పాలి. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని అదే జరిగితే మాత్రం కొన్ని రోజులు పాటు ఇబ్బంది పడటం  ఖాయమని కొత్త అమ్మాయిలూ కూడా భయపడే అవకాశం ఉంటుంది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు మరి. చూద్దాం అసలు ఎక్కడ వరకు వెళ్తుంది అనేది

మరింత సమాచారం తెలుసుకోండి: