రాశీ ఖన్నా... తెలుగులో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్. వరుస ఆఫర్లతో ఆమె వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. అగ్ర హీరోలతో సినిమాలు చేయడమే కాదు చిన్న హీరోల సినిమాలు కూడా చేస్తూ వెళ్తుంది. అయితే ఆమెకు ఈ మధ్య కాలంలో కాస్త ఆఫర్లు ఇచ్చే విషయంలో దర్శక నిర్మాతలు ఆలోచనలో పడిపోయారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు కూడా ఇప్పుడు దాదాపుగా ఆమెకు రావడం లేదు అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. 

 

ఇక అది అలా ఉంటే ఇప్పుడు ఆమె గురించి ఒక వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆమెకు తమిళ సినిమా ఆఫర్లు వస్తున్నాయని అంటున్నారు. ఆ సినిమాల్లో ఆమె కొన్ని కొన్ని వివాదాస్పద పాత్రలు చేయడానికి రెడీ అయింది అని సమాచారం. విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇచ్చిన ఆమె అందరిని షాక్ కి గురి చేసింది. ఇప్పుడు ఆమె తమిళ సినిమాల్లో కాస్త బోల్డ్ గా నటించడానికి రెడీ అయింది అంటున్నారు. ఒక నిర్మాణ సంస్థ ఆమెకు ఆఫర్ ఇచ్చింది అని ఆమె బోల్డ్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని జనాలు అంటున్నారు మరి. నిజం ఎంత అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం ఇప్పుడు ఆ వార్తతో అందరిని షేక్ చేసింది. 

 

అందులో వింత ఏముంది అంటారా సాధారణంగా ఆమె ముందు నుంచి కూడా స్కిన్ షో చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చింది. ఆమెను కూడా దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తగా చూపించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె ఆ విధంగా చేస్తుంది అనగానే చాలా మంది షాక్ గా చూస్తున్నారు మరి. చూడాలి అసలు ఏంటి అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: