త్రిష చేసిన సినిమాలు మన తెలుగులో చాలా వరకు తక్కువే అయినా సరే ఆమె సినిమాల విషయంలో మాత్రం జనాలకు ముందు నుంచి కూడా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఆమె ఏ సినిమా చేసినా సరే జనాలు ముందు నుంచి కూడా కాస్త ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలో  ఆమె పాత్ర విషయమే ఎక్కువగా చర్చ జరుగుతుంది. కింగ్ సినిమాలో గాని కొన్ని కొన్ని సినిమాల్లో ఆమె చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది. అతడు సినిమాలో కూడా ఆమె పాత్రకు చాలా మంచి ఆదరణ అనేది వచ్చింది. 

 

అలా రెండు మూడు సినిమాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక తమిళ్ లో కూడా ఆమె అలాగే విలక్షణం గా నటించే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అనే పేరు కూడా ఉంది. అగ్ర హీరోల సినిమాలు అన్నీ కూడా ఆమె దాదాపుగా చేసింది. ఇప్పుడు ఆమె ఒక బయోపిక్ ని తెలుగు లో ప్లాన్ చేస్తుంది అని అంటున్నారు. నిజం ఎంత అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె బయోపిక్ ని చేయడానికి రెడీ అయింది అని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి ఆమె ఒక సైన్ కూడా చేసే అవకాశ ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. 

 

ఇక తమిళ నిర్మాత కూడా ఈ సినిమాలో ఉంటారు అని టాక్. దాదాపుగా ఆ సినిమాను లైకా ప్రొడక్షన్స్ దిల్ రాజు తో కలిసి తెలుగు లో చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఇక మరి ఎంత వరకు ఆ సినిమా వస్తుంది అనేది చూడాలి. ఆ బయోపిక్  ఒక క్రీడాకారిణికి సంబంధించింది అయి ఉంటుంది అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. చూడాలి అసలు ఆమె ఏ సినిమా చేస్తుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: