రానాసినిమా చేసినా సరే జనాలకు ముందు నుంచి కూడా ఒక రేంజ్ లో క్రేజ్ అనేది ఉంటుంది. సినిమా విడుదల విషయంలో రానా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. ఇక ప్రతీ సినిమాను కూడా రానా ఎన్నో జాగ్రత్తలు తీసుకునే చేస్తాడు.  కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా అతను ఒకటికి వంద సార్లు ఆలోచించి అది కొత్తగా ఉంటే మాత్రమే ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతను క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అనీ సమాచార౦. క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్నారు. 

 

సినిమా అయిన తర్వాత రానా ఒక సినిమాను ముందుకు తీసుకుని వెళ్ళే ఆలోచనలో ఉన్నాడు అనే టాక్ వినపడుతుంది. రానా ఇప్పటికే కథను రెడీ చేసాడు అని అంటున్నారు. ఆ కథను క్రిష్ తో చేయడానికి గానూ ఆయన ముందుకు వస్తున్నారు అని అంటున్నారు. ఇక క్రిష్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో అంటున్నారు. దానికి కారణం కూడా ఉందని అంటున్నారు. అది ఏంటీ అంటే... ఆ సినిమాలో క్రిష్ కూడా ఉంటారు అని ఆయన పాత్రే సినిమాకు కీలకం అని సమాచారం. 

 

ఆయనే సినిమాలో విలన్ అని కూడా టాక్. అది నిజం ఎంత అనేది చూడాలి. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అనేది చూడాలి. రానా ప్రస్తుతం సినిమాలతో కాస్త దూరంగా ఉన్నాడు. పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడు అని తెలుస్తుంది. ఇక పెళ్లి ఏర్పాట్ల విషయంలో అతను కాస్త ఉత్సాహంగా ఉన్నాడు. ఏది ఎలా ఉన్నా సరే ఈ  వార్త టాలీవుడ్ లో కాస్త హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: