గతంలో పండగలకు సినిమాలను విడుదల చెయ్యాలి అంటే చాలు  చాలా వరకు ఆసక్తి చూపించే వారు స్టార్ హీరోలు స్టార్ నిర్మాతలు. స్టార్ దర్శకులు అయితే పండగలను టార్గెట్ చేసుకుని సినిమాలను చేయడానికి ముందుకు వచ్చే వారు అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి గాని ఆ వాతావరణం గాని లేదు అనే విషయం దాదాపుగా అర్ధమవుతుంది. చిన్న చిన్న హీరోలు కూడా పండగలకు సినిమాలను వద్దు అనే ఆలోచనలోనే ఉన్నారట. గతంలో కరోనా లేదు కాబట్టి జనాలు స్వేచ్చగా సినిమాకు వెళ్ళే వారు. 

 

ఇప్పుడు కరోనా ఉండటంతో ఆలోచనలో పడిపోతున్నారు. సినిమా హాల్ కి వెళ్ళాలి అంటే ఎన్ని విధాలుగా జాగ్రత్తగా ఉన్నా సరే కరోనా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జనాలు అసలు హాల్ కి వచ్చే పరిస్థితి అయితే దాదాపుగా లేదు అనే చెప్పాలి. ఇప్పుడు దాదాపుగా రెండేళ్ళ వరకు ఇలాంటి పరిస్థితి లేదు అని హీరోలు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న మరో వార్త ఏంటీ అంటే మెగా హీరోలు అందరికి చిరంజీవి ఇటీవల చెప్పారట. పండగలకు సినిమాలను ప్లాన్ చేయవద్దు అని గ్యాప్ లో సినిమాలను ప్లాన్ చేసుకోవాలి అని సూచనలు చేసారట. 

 

పండగల సమయంలో హాల్ కి ప్రేక్షకులు వచ్చే వాతావరణం ఉండకపోవచ్చు అని జనాలు భయపడవచ్చు అని కాబట్టి అలాంటి ప్లాన్ వద్దు అని చెప్పినట్టు సమాచారం. ఇది నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాలి. ఇటీవల మెగా హీరోలకు కరోనా సమయంలో తన అనుభవం అంతా ఉపయోగించి చిరంజీవి అనేక సలహాలు ఇస్తూ వస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు మెగా హీరోల  విషయంలో అనేది చూడాలి. ఇక వాళ్ళు కూడా కాస్త సినిమాల విషయంలో భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: