అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల డైరక్షన్ లో వస్తున్న సినిమా నాంది. ఈ సినిమాలో న్యాయం జరగడం కోసం ఓ వ్యక్తి ఎదుర్కునే సమస్యలతో టీజర్ కట్ చేశారు. ఇంతకీ నాంది అసలు కథ ఏంటి..? అల్లరి నరేష్ తన రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఎందుకు ఈ సినిమా చేయాలని అనుకున్నాడు అంటే.. తన సినిమాలతో కామెడీ కితకితలు పెట్టే అల్లరోడు కెరియర్ లో ఈమధ్య చాలా వెనుకపడ్డాడు. ఈమధ్య యువ హీరోలంతా కూడా కామెడీ ట్రై చేయడంతో నరేష్ చేస్తున్న సినిమాలకు పెద్దగా డిమాండ్ లేకుండాపోయింది. 

 

అందుకే ఓ మంచి సబ్జెక్ట్ తో తను కూడా కొత్తగా ప్రయత్నించాలని అనుకున్నాడు అల్లరి నరేష్. అలా అనుకోవడమే ఆలస్యం విజయ్ చెప్పిన కథ నచ్చడంతో నాంది సినిమా చేశాడు. ఈ సినిమాలో అసలు మేకప్ లేకుండా కొన్ని సీన్స్ లో న్యూడ్ గా కూడా కనిపించాడు నరేష్. సినిమా కోసం ఎలాంటి రిస్క్ అయినా తీసుకునే నరేష్ నాంది సినిమా చేయడానికి సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా ప్రేరణ అని చెప్పొచ్చు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ 25వ సినిమాగా వచ్చిన సినిమా మహర్షి.

 

ఈ సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో నరేష్ అద్భుతంగ నటించాడు. రవి లాంటి సీరియస్ రోల్ చేసిన నరేష్ తను కూడా సీరియస్ సబ్జెక్టులు చేస్తే వర్క్ అవుట్ అవుతుందని అనుకున్నాడు. అంతకుముందు గమ్యం,శంభో శివ శంభో సినిమాల్లో కూడా నరేష్ చేసిన సీరియస్ రోల్స్ ప్రేక్షకులను మెప్పించాయి. అందుకే నాంది సినిమాలో నరేష్ అందరిని సర్ ప్రైజ్ చేశాడు. ఫస్ట్ ఎఫ్.ఐ.ఆర్ అదే ఫస్ట్ లుక్ టీజర్ ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా టీజర్ చూసిన టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరు నరేష్ కు ఈసారి పక్కా హిట్ వస్తుందని విష్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: