ఆమె ఓ కన్నడ హీరోయిన్.. అక్కడ ఒక్క సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఆ పాపులారిటీతో టాలీవుడ్ లో ఓ యువ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత మరో అప్కమింగ్ హీరోతో బ్లాక్ బస్టర్ అందుకుంది. మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ కొట్టడంతో ఆ హీరోయిన్ కు తెలుగులో సూపర్ క్రేజ్ ఏర్పడింది. యువ హీరోల పక్కన నటించి స్టార్ హీరోయిన్ పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు ఆ యువ హీరోల సినిమాలకే నో అని చెబుతుందట. ఇప్పుడు ఎలాగు తనకు స్టార్ డం వచ్చింది వరుసగా స్టార్ హీరోల ఛాన్సులు వస్తున్నాయి. అందుకే ఇలాంటి టైంలో యువ హీరోలతో చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని భావిస్తుంది అనుకుంటా అందుకే ఆ హీరోయిన్ తన మేనేజర్ కు కేవలం స్టార్ సినిమా అయితేనే తన దాకా రమ్మని చెప్పిందట. 

 

ఈ ఇయర్ ఆల్రెడీ ఓ స్టార్ హీరో సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకున్న ఈ భామ నెక్స్ట్ కూడా క్రేజీ స్టార్ తో సినిమా చేస్తుంది. ఇక ఇక్కడే కాకుండా తమిళంలో కూడా అమ్మడికి వరుస అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ మొదటి సినిమా చేస్తుండగా రెండో ప్రాజెక్టే పెద్ద సినిమా వచ్చిందని అంటున్నారు. ఇక ఈమధ్యలోనే ఓ యువ హీరో సినిమాలో హీరోయిన్ గా నటించాలని అడిగితే సారీ డేట్స్ ఖాళీగా లేవని చెప్పిందట. మరి యువ హీరోతో చేయడం ఇష్టం లేక అలా చెప్పిందో లేక నిజంగానే డేట్స్ ఖాళీ లేవో కాని అమ్మడు గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ నడుస్తుంది.

 

అయితే ఆమె చేస్తున్న సినిమాలన్ని సక్సెస్ అవుతుండటంతో ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి మరి స్టార్ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నారట. మరి పిలిచి అవకాశం ఇస్తున్న స్టార్ సినిమాలను ఆ హీరోయిన్ ఎలా కాదనుకుంటుంది చెప్పండి. మొత్తానికి తెలుగులో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న ఆ హీరోయిన్ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే అని టాక్ బాగా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: