చిన్నపాటి వైరస్ ప్రపంచంలో అన్ని రంగాలను నష్టం లోకి నెట్టేస్తుంది. పేదవాడి జీవితం మొదలుకొని దేశ ఆర్థిక పరిస్థితులు అన్నిటిలో అనేక మార్పులు తీసుకొస్తుంది. ముఖ్యంగా సినిమా రంగానికి తీరని నష్టాన్ని వైరస్ మిగిల్చింది అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. పైగా వేసవి సీజన్ స్టార్టింగ్ లో ఈ వైరస్ ఎంటర్ అవటంతో రిలీజ్ కావాల్సిన సినిమాలు మొత్తం ఆగిపోయాయి. కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవటంతో దేశంలో అన్ని క్లోజ్ పోవటంతో సినిమా షూటింగులు ఆగిపోగా థియేటర్లు క్లోజ్ అయిపోయాయి. ఇదిలా ఉండగా కాగా ఇటీవల సినిమా షూటింగ్లకు అనుమతులు వచ్చినా గానీ ప్రజెంట్ దేశంలో ఉన్న కొద్ది వైరస్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో బయట పడుతున్న తరుణంలో భవిష్యత్తులో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం లేదు అన్న టాక్ బలంగా వినబడుతుంది.

 

కేవలం పదిమంది సమావేశమైన చోటే వైరస్ కేసులు వస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో ఇంకా సినిమా థియేటర్లు ఈ ఏడాది లో ఓపెన్ చేసే అవకాశం లేదన్న టాక్ బలంగా వినబడుతోంది. సినిమా నిర్మించే నిర్మాతలు కూడా సినిమాలు  థియేటర్ల లో విడుదల చేస్తేనే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండటంతో ఇప్పుడప్పుడే సినిమాలు రిలీజ్ చేయకూడదని మొన్నటివరకు భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి చూస్తుంటే భవిష్యత్తులో సినిమా ధియేటర్ల వ్యాపారం పూర్తిగా క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు.

 

ఈ విషయం నడుస్తూ ఉండగానే దీన్ని  డీల్ చెయ్యడం లో భాగంగా మరొక పక్క కొంత మంది డైరెక్టర్లు ప్రేక్షకులను ఓటీటీ కి అలవాటు చేసే విధంగా సినిమాలు రిలీజ్ చేస్తున్న తరుణంలో… ప్రేక్షకులు కరోనా భయంతో థియేటర్లకు వచ్చే ఆసక్తి భవిష్యత్తులో ఉండదు అని అంటున్నారు. చాలావరకు ఇంకా థియేటర్లు ప్రస్తుత పరిస్థితులు బట్టి పూర్తిగా డేంజర్ జోన్ లోకి వెళ్లి పోయినట్టే అని ఇండస్ట్రీకి చెందిన వారు అంటున్నారు. ప్రేక్షకుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం సినిమాలు ఓటీటీలో చూడటానికి ఎక్కువ మక్కువ చూపే అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో సినిమాలు థియేటర్లో రిలీజ్ కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: