తానేం చేసినా అదే సంచలనం అనుకునే ఆర్జివి లేటెస్ట్ గా నగ్నం సినిమా కాదు కాదు సినిమాకు తక్కువ షార్ట్ ఫిల్మ్ కు ఎక్కువ అని చెప్పేలా ఉన్న సినిమా తీశాడు. ఈ సినిమా ఎలా ఉంది అంటే.. ఓ అక్రమ సంబంధం కథని అంతే చెత్తగా తీశాడు వర్మ. అందులో నటించిన హీరోయిన్ అంగాంగ ప్రదర్శనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథ, కథనాలను పక్కన పెట్టి కేవలం ఆమె అందాలను కెమెరాలో బందించే ప్రయత్నం చేశాడు. ఆర్జివి మార్క్ సినిమా కాదు కదా కనీసం ఓ కొత్త దర్శకుడు చేసిన సినిమాలా కూడా లేదు.

 

హీరోయిన్ ఎక్స్ పోజింగ్, కెమెరా ఫ్రేంస్ తప్ప సినిమాలో చెప్పుకోడానికి మ్యాటర్ ఏం లేదు. కెమెరా ఎక్కడ పెట్టకూడదో అక్కడ పెట్టాడు. అంతేకాదు కెమెరా దూరని టైంలో సెల్ ఫోన్ కెమెరాతో తీసినట్టు తెలుస్తుంది. ఒకప్పుడు వచ్చిన షకీలా సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా వర్మ నగ్నం సినిమా ఉంది. ఇక ఆర్జివి సినిమాలో టీజర్, ట్రైలర్ ఎలా ఉంటాయో తెలిసిందే.

 

ట్రైలర్ చూసి సినిమా మీద ఆస్కతితో 200 రూపాయలు ఖర్చు పెట్టి మరి నగ్నం సినిమా చూసిన వారు షాక్ అవకతప్పదు. తలతోక లేని కథ.. సినిమాకు ఏమాత్రం పనికిరాని సబ్జెక్ట్ ఇలా ఓ షార్ట్ ఫిల్మ్ కథతో అంతకన్నా ఘోరంగ తీసిన సినిమా నగ్నం. లాక్ డౌన్ టైంలో అందరు బి ద రియల్ మెన్ ఛాలెంజ్ చేస్తే తాను క్లైమాక్స్, నగ్నం సినిమాలు తీశానని చెప్పుకుంటున్న వర్మ ఇలాంటి సినిమాలు తీసి ఉన్న పేరుని చెడగొట్టుకుంటున్నాడని చెప్పొచ్చు. ఆర్జివి తీసిన కళాకండాల్లో ఇది కూడా ఒకటి. మొన్నీమధ్యన వచ్చిన క్లైమాక్స్ సినిమా విషయంలో కూడా ట్రైలర్ తో మెప్పించి సినిమాలో మ్యాటర్ ఏం లేకుండా చేసిన ఆర్జివి నగ్నం సినిమాలో కూడా అంతే దారుణంగా ప్రేక్షకులను మోసం చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: