పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడిపోయిన తరువాత అతడి పిల్లలను కేవలం పవన్ పిల్లలుగా మాత్రమే కాకుండా వారికంటూ ఒక వ్యక్తిత్వం ఉండే విధంగా పెంచాలని రేణు దేశాయ్ ఒక తల్లిగా చాల గట్టిప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఒక మీడియా సంస్థకు ఈమధ్య రేణు దేశాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పిల్లలు ముఖ్యంగా అకిరా గురించి మాట్లాడుతూ ఆమె చేసిన హెచ్చరికలు దేనికిసంకేతం అన్నకోణంలో ఇప్పుడు పవన్ అభిమానుల మధ్య ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.


ప్రస్తుతం అకిరా వ‌య‌సు 16 ఏళ్లు అని అంటూ భవిష్యత్ లో ఎదో సాధించాలి అని ఆలోచనలు చేస్తూ టెన్షన్ పడేకన్నా ముందు మనిషిగా బ్రతకమని తాను అకిరా కు సలహాలు ఇచ్చిన విషయాన్ని వివరించింది. ఇదే సందర్భంలో రేణు దేశాయ్ మాట్లాడుతూ అకిరా ను తన తండ్రి పవన్ కళ్యాణ్ లా పెదనాన్న చిరంజీవి లా అన్న రామ్ చరణ్ లా హీరో కావాలి అనే ఒత్తిడి పెంచుకుని అనవసరంగా టెన్షన్ పెట్టుకోవద్దు అంటూ సలహాలు ఇస్తున్న విషయాన్ని వివరించింది.


అంతేకాదు అకిరా మనసుకు ఏది నచ్చితే అది చేయమని సలహాలు ఇస్తున్నానని జీవితంలో విజయం సాధించాలి అంటే సినిమాలు ఒక్కటే మార్గం కాదు అని తాను చెపుతున్న విషయాలను బయటపెట్టింది.  దీనితో అకిరా వారసత్వ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే విషయంలో రేణు దేశాయ్ కు వేరే అభిప్రాయాలు ఉన్నాయా అంటూ అనుమానాలు మెగా అభిమానులలో మొదలవుతున్నాయి.


దీనికితోడు ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ అకిరా కు అడవి శేషు అభిమాన నటుడు అంటూ చేసిన కామెంట్స్ ను కూడ మెగా అభిమానులు గుర్తుకు చేసుకుంటూ అఖిరా వారసత్వ హీరో ఆలోచనలను ముందుగానే రేణు దేశాయ్ తుంచి వేస్తోందా అంటూ మరికొందరు మెగా అభిమానులు రేణు దేశాయ్ కామెంట్స్ పై విమర్శలు చేస్తున్నారు. దీనితో అకిరా ను పవన్ వారసుడుగా చూసుకోవాలని కలలు కంటున్న అభిమానుల ఆశల పై రేణు నీళ్ళు చల్లింది అంటూ మెగా అభిమానులు గగ్గోలు పెడుతున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: