కేఆర్ విజయ... చాలా తక్కువ కాలంలో స్టార్ నటిగా మంచి సినిమాలు చేసి స్టార్ గా ఒక వెలుగు వెలిగారు. ఆమె నటన ఆమె అందం ఆమె నవ్వు చూసి అన్ని భాషల్లో కూడా ఫిదా అయిపోయారు అనేది వాస్తవం. ఆమె చేసిన సినిమాలు ఆమె నటన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చాలా మంచి పాత్రలు చేస్తూ వచ్చారు. అదే విధంగా అమ్మగా అయినా సరే అమ్మమ్మగా అయినా సరే ఆమె చాలా మంచి పాత్రలు చేసారు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆమె గురించి ఒక ప్రత్యేక విషయం ఏంటీ అంటే... 

 

ఇండియన్  నటుల్లో ఆమె నవ్వు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. ఆమె నవ్వినా అంత అందంగా ఎవరూ కూడా నవ్వలేరు అని చెప్తారు చాలా మంది. ఆమె నవ్వు చూడటానికి సినిమాకు వెళ్ళిన వాళ్ళు ఆమె నవ్వు చూడటానికి ఆమె సినిమాలు టీవీ లో చూసిన వాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు. ఆమె నవ్వు మ్యాగజైన్ స్తోరీల్లో బాగా హైలెట్ అయింది. ఆమె నవ్వు గురించి రచయితలు ఎన్నో కథనాలు రాసారు అప్పట్లో. ప్రముఖ పాత్రికేయులు కూడా ఆమె నవ్వు గురించి ఎన్నో సందర్భాల్లో ఆమె క్రేజ్ కి సంబంధించిన కథనాలు రాసే వారు. 

 

అలా ఆమె  మ్యాగజైన్ స్తోరీల్లో ఎక్కువగా ఉండే వారు. ఇప్పుడు ఆమె సినిమాలకు దాదాపుగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె సినిమాలు ఆమె నటన అన్నీ కూడా ఇంకా జనాలకు గుర్తు ఉంది అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె అవకాశాలు వచ్చినా సరే పెద్దగా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. వయసు మీద పడటమే  దీనికి ప్రధాన కారణం. ఇక ఆమె తో స్టార్ హీరోలు అప్పట్లో మంచి సినిమాలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: