ఈరోజునుండి మళ్ళీ లాక్ డౌన్ మరో నెలరోజుల పాటు కరోనా ప్రభావిత ప్రాంతాలలో పొడిగించిన నేపధ్యంలో ఈనిబంధనలు తెలంగాణ సర్కార్ ఈసారి మరింత కఠినంగా అమలు చేసే విధంగా లీకులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడిప్పుడే అక్కడక్కడా మొదలైన చిన్నసినిమాల షూటింగ్ లకు టివి సీరియల్ షూటింగ్ లకు మళ్ళీ బ్రేక్ పడబోతోంది.


ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడిప్పుడే ఉపాది అవకాశాలు దొరుకుతున్న చిన్నాచితకా ఆర్టిస్టులకు సాంకేతిక నిపుణులకు మళ్ళీ పనిలేని రోజులు ఏర్పడబోతున్నాయి. దీనితో అసలు ఎప్పటికి ఇండస్ట్రీ పరిస్థితులు కుదురు పడతాయో ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది.


ఇలాంటి పరిస్థితులలో టాప్ హీరోల నుండి చిన్న నటీనటుల వరకు అందరు ఏర్పడ్డ కరోనా పరిస్థితులను ద్వేషిస్తూ ఉంటే అల్లరి నరేశ్ కు మాత్రం కరోనా ఒక ఊహించని అదృష్టాన్ని ఇచ్చే ఆస్కారం కనిపిస్తోంది. నిన్న జరిగిన అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆశ్చర్యకర విషయం బయటపెట్టాడు.


గతంలో తాను నటించిన ‘కితకితలు’ సినిమా స్థాయిలో తాను ‘కరోనా’ అన్న టైటిల్ తో ఒక పూర్తి కామెడీ సినిమాను తీయబోతున్న విషయాన్ని లీక్ చేసాడు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పై ముగ్గురు హాస్య రచయితలు పనిచేస్తున్న విషయాన్ని వివరిస్తూ సినిమాల షూటింగ్ లు తిరిగి మొదలుపెట్టగలం అన్న ధైర్యం వచ్చిన తరువాత ఈ మూవీని చాలవేగంగా పూర్తిచేసి జనం కరోనా కష్టాలు మర్చిపోక ముందే ఈమూవీని విడుదల చేయబోతున్నట్లు లీకులు ఇచ్చాడు. ఇదే సందర్భంలో మాట్లాడుతూ తన లేటెస్ట్ మూవీ ‘నాంది’ గురించి మాట్లాడుతూ ఈసినిమాలో తను మేకప్ లేకుండా నటిస్తున్న విషయాన్ని తెలియచేస్తూ ఈ మూవీతో తిరిగి తనకు పునర్వైభవం వస్తుంది అన్న నమ్మకం తనకు ఉంది అంటూ అల్లరోడు తన భవిష్యత్ కు కరోనా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అన్న నమ్మకంలో ఉన్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: