కరోనా క్రైసి కారణంగా సినిమాలు రిలీజ్ కాకపోవడంతో సినీ ప్రియుల్లో ఒకింత నిరుత్సాహం నెలకొంది. వారనికోసారి థియేటర్ కి వెళ్లే ప్రేక్షకులైతే ఓటీటీ వేదికగా సినిమాలూ చూస్తూ ఆనందిస్తున్న థియేటర్ అనుభవం మిస్ అవుతున్నామన్న భావన చాలా మందిలో కలుగుతుంది. అయితే సినిమాలు లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సూచనల ప్రకారం సినిమా షూటింగులు స్టార్ట్ అయిపోయాయి.

 

ఈ నేపథ్యంలో కొత్త సినిమా ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం సినీ అభిమానులకి ఇవే ఓ ఆశాకిరణంలా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో సినిమాకి ఎలాంటొ ప్రాబ్లెమ్ ఉండదన్న భరోసాని కలిగిస్తున్నాయి. తాజాగా చాలా సినిమాలు స్టార్ట్ కానున్నాయి. అందులో భాగంగానే వస్తున్న సరికొత్త చిత్రంతో శివానీ రాజశేఖర్, హీరో రాజశేఖర్ కూతురు హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది.

IHG

రాజశేఖర్ పెద్ద కూతురైన శివానీ రాజశేఖర్ సినిమాల్లో అరంగేట్రం చేయబోతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. తాజాగా తన మొదటి సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివానీ రాజశేఖర్ బిల్డింగ్ పైన కూర్చుని చందమామ కేసి వేలు చూపెడుతూ పక్కింటి అమ్మాయిలా కనిపించింది. వెన్నెలని చూపిస్తున్న ఈ అందమైన పాత్ర పేరు వెన్నెలగా పరిచయం చేసారు.

 

ఓ బేబీ సినిమాలో సమంత మనవడిగా నటించిన తేజ సజ్జా ఈ సినిమాతో హీరోగా పరిచయం అవబోతున్నాడు.  మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమాని ఎస్ ఒరిజినల్స్, మహతేజ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమా ద్వారా శివానీ రాజశేఖర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికే రాజశేఖర్ చిన్న కూతుతు శివాత్మికా దొరసాని సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: