బాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాలు ఆమెకు హిందీ లో హాలీవుడ్ లో వచ్చిన పేరు అందరికి తెలిసిందే. ఎవరికి రాని విధంగా ఆమె హాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నారు అనేది వాస్తవం. మన ఇండియా లో ఆమె ఒక్కరే హాలీవుడ్ లోకి వెళ్లి సూపర్ సక్సెస్ అయిన హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఆమె నటనకు అక్కడి జనాలు బ్రహ్మరధం పట్టారు అని అంటారు అయితే ఆమెకు వరుసగా ఫ్లాపులు రావడం ఆమె కెరీర్ ని బాగా ఇబ్బంది పెట్టింది అని చాలా మంది అంటున్నారు ఇప్పుడు. 

 

అందుకే ఆమె హాలీవుడ్ కి చాలా దూరంగా ఉంది అని చెప్తున్నారు. ఆమె చాలా వరకు అక్కడ స్టార్ హీరోలతోనే సినిమాలు చేసింది. స్టార్ సింగర్ ని వివాహం చేసుకుని  మంచి ప్రమోషన్ కూడా సాధించినా సరే ఆమె మాత్రం అక్కడ నిలబడటం లో కాస్త ఇబ్బంది పడుతుంది అనే కామెంట్స్ ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆమె మన ఇండియా లో ప్రముకః వ్యాపార సంస్థలకు చెందిన మ్యాగజైన్ స్టోరీ లలో ఎక్కువగా ఉంటారు. ఇప్పటికి కూడా ఏదోక వ్యాపార ఆసంస్థ ఆమెను వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

 

ఇక ఇందుకు ఆమె భారీగానే వసూలు చేస్తూ ఉంటూ ఉంటారని అంటారు. ముఖ్యంగా కింగ్ ఫిషర్ లాంటి సంస్థ ఆమెకు భారీగా ఇచ్చుకుంది ఇలాంటి విషయాల్లో అని చెప్పే వారు. ఇక ప్రముఖ గోల్డ్ షాపులు కూడా ఆమెకు ఉన్న పేరుని బాగానే వాడుకున్నాయి అని చెప్పాలి. ఇక ఆమెకు యూత్ లో క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఆ క్రేజ్ ని ఆమె ను ఫాలో అయిన వాళ్ళు కూడా అప్పట్లో బాగానే వాడుకునే వారు.

మరింత సమాచారం తెలుసుకోండి: