మన ఇండియ లో శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నటన ఆమె సినిమాలు ఆమెకు వచ్చిన పేరు ఆమె సాధించిన విజయాలు ఆమె నిలబెట్టుకున్న పేరు... ఆమెకు ఉండే స్థాయి గురించి అందరికి తెలిసిన విషయమే. ఎవరికి రాని పేరు ని చాలా తక్కువ కాలంలో ఆమె సొంతం చేసుకున్నారు. ఆమె ఎవరికి అందని ఎత్తులో నిలబడ్డారు. ఎవరూ అందుకోలేని స్థాయికి ఆమె చేరుకున్నారు. ఎంత మంది హీరోయిన్ లు ఉన్నా సరే ఆమె ఉంటే ఆ సినిమాకు ఒక రేంజ్ అని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు చాలా మంది. 

 

స్టార్ హీరోల సినిమాలు అనగానే ఆమె ఉండాలి అనేది చాలా మంది అప్పట్లో పదే పదే చెప్తూ వచ్చిన మాట. ఆ విధంగా ఆమె తన పేరు తెచ్చుకున్నారు. ఇండియన్ సినిమాలో ఆమె గురించి ప్రస్తావన లేకుండా అసలు ఉండదు. లేడీ సూపర్ స్టార్ గా ఆమె తన పేరు ని కాపాడుకున్నారు అనే చెప్పాలి. ఏ భాషలో అయినా సరే ఆమెను మించిన హీరోయిన్ మరొకరు లేరు అనేది అందరికి తెలిసిన విషయమే. ఇక అది అలా ఉంటే ఆమె అప్పట్లో సన్ డే మ్యాగైజన్ లో ఎక్కువగా కనపడే వారు. అదే విధంగా వ్యాపార సంస్థల ప్రమోషన్ లో కూడా ఆమెను ఎక్కువగా చూపించే వారు. 

 

అప్పట్లో కొన్ని వస్త్రాల పరిశ్రమలు, బంగారపు షాపులు అదే విధంగా విమానాలకు సంబంధించిన స్టోరీ లు ఎక్కువగా ప్రచురించిన సమయంలో ఆమె ఫోటోలను ఎక్కువగా వాడుకునే వారు. ఆమెకు భారీగా ఇచ్చే వారు అని కూడా అంటూ ఉంటారు. ఆమె కూడా ఎక్కడా రాజీ లేకుండా తీసుకునే వారు అని కూడా అంటారు. అప్పట్లో ఆమె అంటే ఒక క్రేజ్ అనేది ఉండేది జనాలకు.

మరింత సమాచారం తెలుసుకోండి: