సిల్క్ స్మిత... ఇండియన్ సినిమా ఎప్పటికి కూడా మరువలేని పేరు ఇది. ఆమె గురించి చాలా తక్కువ మందికి పరిచయం ఉంది గాని ఆమె సాధించిన పేరు గురించి మాత్రం చాలా మందికి అవగాహన ఉంది. ఒక సూపర్ స్టార్ కి వచ్చిన ఇమేజ్ ఆమెకు వచ్చేది. ఐటెం సాంగ్ అనగానే ఆమె తర్వాతనే ఎవరు అయినా సరే అంటూ ఉండే వారు అప్పట్లో. ఆ విధంగా ఆమె తనకంటూ ఒక మార్క్ ని వేసుకుని తన పేరు ని నిలుపుకున్నారు అనే చెప్పాలి. ఆమెకు ఎవరికి రాని విధంగా అప్పట్లో గుర్తింపు వచ్చింది. స్టార్ హీరోలు కూడా ఆమె గుర్తింపు చూసి షాక్ అయిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. 

 

ఇక అది అలా ఉంటే సన్ డే మ్యాగజిన్ గాని వ్యాపార  సంస్థలు ప్రత్యేకంగా ఇచే మ్యాగజైన్ లో గాని ఆమె  కచ్చితంగా ఉండే వారు అప్పట్లో. ఐటెం గర్ల్ గా ఆమెను చాలా మంది గుర్తించినా సరే ఆమె అందం మాత్రం ఏ విధంగా కూడా మరువలేనిది అని చాలా మంది అప్పట్లో ఆమెను ఉద్దేశించి కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు. ఆమె స్టార్ హీరోయిన్ అయి ఉంటే అసలు ఇప్పుడు ఉన్న వారు ఎవరూ కూడా ఆమె నటన తో పేరు తెచ్చుకోలేరు అని కనీసం ఆమె స్థాయిని కూడా అందుకునే వారు ఎవరూ లేరు అని అంటారు సినీ జనాలు. ఆ విధంగా సిల్క్ తన పేరు ని కాపాడుకునే వారు అంటూ ఉంటారు. 

 

ఇప్పుడు ఆమె లేదు గాని ఆమె ఉండి ఉంటే ఆమెను కచ్చితంగా తమ సినిమాల్లో అగ్ర హీరోలు కచ్చితంగా ఏదోక పాత్రకు ఆమెను తీసుకుంటారు అంటూ అంటూ ఉంటారు సినీ జనాలు... ఆమెను పలువురు మోసం చేసారని చెప్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: