బాలీవుడ్ హీరోలందరిలోకి అత్యధిక సినిమాలు చేస్తూ ఎక్కువ సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న హీరో ఎవరంటే మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు అక్షయ్ కుమార్. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ బాలీవుడ్ లోని ముగ్గురు ఖాన్ లని వెనక్కి నెట్టి విజయవంతంగా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. ఖాన్ త్రయం ఏడాదికి ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని ప్రస్తుత పరిస్థితుల్లో అక్షయ్ కుమార్ వేగం బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా ఉంది.

 


అయితే కరోనా కారణంగా థియేటర్లు మూతబడిపోవడంతో బాలీవుడ్ లో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీ వేదికగా రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు. కరోనా వల్ల కాలమాన పరిస్థితులు మరింత దిగజారుతున్న నేపథ్యంలో థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే వీలు కనిపించడం లేదు. అందువల్ల మేకర్స్ థియేటర్స్ రిలీజ్ అయ్యే వరకి ఓపిక పట్టలేక డైరెక్ట్ స్ట్రీమింగ్ సైట్స్ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

 

 

ఈ నేపథ్యంలో బాలీవుడ్ పెద్ద సినిమాలు కూడా డిజిటల్ లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. అయితే పెద్ద హీరో నటించిన సినిమాలకి ఓటీటీ వేదికలు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా ఇప్పటి వరకూ ఓటీటీ చరిత్రలోనే ఎక్కువ డబ్బులకి అమ్ముడుపోయిన చిత్రంగా అక్షయ్ కుమార్ చిత్రం లక్ష్మీ బాంబ్ రికార్డులకెక్కింది.  ఇండియాలో ఇప్పటి వరకూ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాలన్నింటిలో కెల్లా ఇదే అత్యధిక రేటుకి  అమ్ముడుపోయిందని చెబుతున్నారు.  

 

రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన కాంచన సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవనుంది. మొత్తానికి అక్షయ్ కుమార్ లక్ష్మీ బాంబ్ బాగానే పేలింది..

మరింత సమాచారం తెలుసుకోండి: